తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జోష్ పెంచిన సూర్య- 4నెలల్లోనే సినిమా కంప్లీట్! - Suriya 44 Movie - SURIYA 44 MOVIE

Suriya 44 Movie : తమిళ స్టార్ హీరో సూర్య- కార్తిక్ సుబ్బరాజు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ 4 నెలల్లో కంప్లీట్ అయ్యింది.

Suriya 44 Movie
Suriya 44 Movie (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2024, 1:08 PM IST

Updated : Oct 7, 2024, 1:17 PM IST

Suriya 44 Movie :కోలీవుడ్ స్టార్ హీరో సూర్య - కార్తిక్ సుబ్బరాజు కాంబోలో '#సూర్య44' వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని హీరో సూర్య సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు మూవీటీమ్​తో కలిసి సెట్స్​లో దిగిన ఫొటో ఒకటి షేర్ చేశారు. అయితే జూన్​లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్​లో ముగియడం విశేషం.

'ఎన్నో లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్‌ చేశాం. షూటింగ్ అంతా చాలా ఆనందంగా జరిగింది. ఈ చిత్రం కోసం అనేకమంది టాలెంటెడ్‌ వ్యక్తులు పని చేశారు. కార్తిక్‌ సుబ్బరాజు నాకు సోదరుడితో సమానం. అతడి దర్శకత్వంలో పని చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ మూవీటీమ్ నాకు జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలను అందించింది' అంటూ మూవీయూనిట్​కు సూర్య కృతజ్ఞతలు తెలిపారు. దీనికి దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు స్పందించారు. 'సినిమాపై మీకున్న అంకితభావం, నిబద్ధత వల్లే షూటింగ్‌ ఇంత తర్వగా పూర్తిచేయగలిగాం' అంటూ సూర్యకు కార్తిక్‌ సుబ్బరాజు రిప్లై ఇచ్చారు.

4 నెలల్లో కంప్లీట్
ఈ ఏడాది మార్చిలోనే ఈ ప్రాజెక్ట్​ను ప్రకటించారు. జూన్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించి, ఆదివారం (అక్టోబర్‌ 6) చిత్రీకరణ పూర్తి చేశారు. అంటే కేవలం 4 నెలల్లో సినిమాను కంప్లీట్‌ చేశారు. జెట్​ స్పీడ్​తో సినిమా కంప్లీట్ చేయడం వల్ల ఫ్యాన్స్​ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించారు. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఈ సినిమాను ప్రేమ, యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందింది. కల్కి ఫేమ్ సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక జోజు జార్జ్‌, జయరామ్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

కంగువా
మరోవైపు, సూర్య 'కంగువ'తో నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్​తో తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ హీరోయిన్‌గా నటించింది. కంగ అనే ఓ పరాక్రముడి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య ఆరు విభిన్న లుక్స్‌లో కనిపిస్తారని సమాచారం.

అప్పుడు ఫియర్, ఇప్పుడు ఫైర్​ - ట్రెండింగ్​లో 'కంగువ' ఫస్ట్ సింగిల్ - మీరు విన్నారా? - Kanguva First Single Released

'కంగువ'.. సూర్యకి 'బాహుబలి' లాంటి సినిమా అవుతుందా?

Last Updated : Oct 7, 2024, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details