తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఎన్టీఆర్​తో సినిమా ఎప్పుడు చేస్తారు?' - వైరల్​గా మారిన వెట్రిమారన్​ సమాధానం! - Vetrimaran Comments on NTR - VETRIMARAN COMMENTS ON NTR

Devara NTR Vetrimaaran Movie: తనతో సినిమా చేయలని ఉందని ఎన్టీఆర్​ అన్న వ్యాఖ్యలపై దర్శకుడు వెట్రిమారన్ స్పందించారు. ఏం అన్నారంటే?

source ETV Bharat
NTR Vetrimaaran (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 10:42 AM IST

Devara NTR Vetrimaaran Movie :ప్రస్తుతం యంగ్​ టైగర్ ఎన్టీఆర్​ 'దేవర' ప్రమోషన్స్​తో బిజీగా తిరుగుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో వరుసగా ప్రచార చిత్రాలను కూడా మూవీటీమ్ విడుదల చేస్తోంది. అయితే ప్రమోషన్స్​లో భాగంగా తారక్​ రీసెంట్​గా చెన్నై వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ తన ఫేవరెట్ డైరెక్టర్​ వెట్రిమారన్​ అని చెప్పిన తారక్​, ఆయనతో కలిసి సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటను చెప్పారు. "నా ఫేవరెట్ డైరెక్టర్​ వెట్రిమారన్‌. ఆయన ఎప్పుడు నాతో సినిమా తీస్తే అప్పుడు డైరెక్ట్​గా తమిళంలో నటిస్తాను" అని చెప్పారు. దీంతో ఈ కామెంట్స్​ అటు తమిళ సినీ ప్రియుల్లో, ఇటు తెలుగు మూవీ లవర్స్​లో వైరల్​గా మారాయి.

అయితే ఇప్పుడా కామెంట్స్​ దర్శకుడు వెట్రిమారన్​ దగ్గరకు చేరాయి. దీంతో ఆయన ఎన్టీఆర్​తో సినిమా చేసే విషయంపై స్పందించారు. "నేను తారక్​ సార్​ చర్చలు జరుపుతున్నాం. మా కమిట్​మెంట్స్​ పూర్తైపోతే మూవీ ప్రారంభిస్తాం" అని చెప్పుకొచ్చారు. వాస్తవానికి గతంలోనే ఎన్టీఆర్​తో సినిమా చేయాల్సింది. కానీ అప్పుడు వేరె కమిట్​మెంట్స్​ ఉండటం వల్ల కుదరలేదు. అందుకే ప్రస్తుతం తాను కమిట్‌ అయిన ప్రాజెక్ట్​లను పూర్తి చేసి ఎన్టీఆర్​తో సినిమా చేస్తానని వెట్రిమారన్ కాన్ఫిడెంట్​గా అన్నారు.

ఇప్పుడీ కామెంట్స్ కూడా ఫ్యాన్స్​లో ఆసక్తిని పెంచేశాయి. భవిష్యత్తులో వెట్రిమారన్​ - తారక్ కాంబోలో కచ్చితంగా సినిమా ఉంటుందని సంబరపడుతున్నారు. అసలే మట్టి వాసన ఉండే సినిమాలను తెరకెక్కించడంలో వెట్రిమారన్ స్పెషలిస్ట్​. 'ఆడుగలం', 'అసురన్' చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మరి అలాంటి దర్శకుడి డైరెక్షన్​లో ఎన్టీఆర్‌ నటిస్తే నటనకు స్కోప్ ఉండే మంచి పాత్ర దక్కుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Vetrimaran viduthalai 2 Movie : ఇకపోతే గతంలో తమిళ కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో వెట్రిమారన్ తీసిన సినిమా 'విడుదల'. ఇప్పుడాయన విడుదల 2 కోసం పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఆ సినిమాను పూర్తి చేసి, వచ్చే ఏడాదిలో సూర్యతో భారీ బడ్జెట్‌ సినిమా వాడివాసల్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

విడుదలకు ముందే దూసుకెళ్తోన్న 'దేవర' - ఆ రికార్డులన్నీ బ్రేక్​! - Devara Movie Records

ఆ మూవీ షూటింగ్​లో వాళ్లను గన్​తో బెదిరించిన చిరు! - అసలు అప్పుడేం జరిగిందంటే? - Chiru Threatened with Real Gun

ABOUT THE AUTHOR

...view details