Suriya Kanguva Editor Nishad Yusuf Died : ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సూర్య నటించిన లేటెస్ట్ మూవీ 'కంగువా' సినిమాకు పనిచేసిన ప్రముఖ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్నుమూశారు. 43 ఏళ్ల నిషాద్ కేరళ పనమ్పిల్లీ నగర్‌లోని తన అపార్ట్మెంట్లో మరణించారు. అయితే మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. నిషాద్ బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అర్ధ రాత్రి 2 గంటల సమయంలో ఆయన మరణించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత నిషాద్ మృతదేహాన్ని ఎర్నాకులం జనరల్ ఆస్పత్రికి తరలించనున్నారట.
కాగా, నిషాద్ థల్లుమాలా, చావెర్, ఉండా, సౌదీ వెళ్లాక, వన్, ఆపరేషన్ జాావా, చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశారు. చివరిగా బజూక, కంగువా సినిమాలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. థల్లుమల్లా సినిమాకు గానూ 2022లో నిషాద్ బెస్ట్ ఎడిటర్‌గా నేషనల్ అవార్డ్‌ను అందుకున్నారు. త్వరలోనే మమ్ముట్టి నటించిన 'బజూక', సూర్య నటించిన 'కంగువా' చిత్రాలు రిలీజ్ కానున్నాయి.