Suriya Jyothika Divorce : సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా డివోర్స్ తీసుకోబోతున్నారనే పుకార్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిలో ప్రస్తుతం స్టార్ కపుల్ సూర్య-జ్యోతిక పేర్లు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలకు జ్యోతిక చెక్ పెట్టింది. వివరాల్లోకి వెళితే.. 2006, సెప్టెంబరు 11న పెళ్లి బంధంతో ఒకటైన ఈ జంటకు సినీ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. రీల్ లైఫ్‌లో తమ యాక్టింగ్‌తో అభిమానుల మనసును ఎంతగా దోచుకున్నారో అలాగే నిజ జీవితంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు.
అయితే కొంత కాలంగా ఈ జంట వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ స్టార్ కపుల్ విడిపోతున్నారని, త్వరలోనే డివొర్స్ తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిక తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసి ఈ పుకార్లకు ముగింపు పలికింది. రీసెంట్గా ఈ జంట ఫిన్లాండ్ పర్యటనకు వెళ్లారు. ఇప్పుడా ఆ పర్యటన వీడియోని '2024 –(A year full of travel)' అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సూర్య జ్యోతిక హాలిడే ట్రిప్‌ను కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. తమ విడాకులకు సంబంధించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, తమ బంధం చాలా గట్టిదని అనే అర్థం వచ్చేలా ఈ వీడియో పోస్ట్ చేసినట్లు అర్థమైంది.