తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'వన్​పీస్' వైబ్​ - సూర్య 44 స్పెషల్ గ్లింప్స్​ చూశారా? - Suriya 44 Movie - SURIYA 44 MOVIE

Suriya 44 Glimpse : స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'సూర్య 44' నుంచి మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ గ్లింప్స్​ను విడుదల చేశారు. దాన్ని మీరూ చూసేయండి.

Suriya 44 Glimpse
Suriya (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 9:08 AM IST

Updated : Jul 23, 2024, 9:46 AM IST

Suriya 44 Glimpse : తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవలే 'కంగువ' సినిమా షూటింగ్​ను సక్సెస్​ఫుల్​గా కంప్లీట్ చేశారు. దీంతో పాటు మరిన్ని ప్రాజెక్టుల్లో ఆయన బిజీగా ఉన్నారు. అందులో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్‌ సుబ్బరాజుది ఒకటి. #Suriya 44 అనే వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. మంగళవారం (జులై 23) సూర్య పుట్టినరోజు సందర్భంగా Suriya 44 గ్లింప్స్​ను రిలీజ్ చేసి సూర్యకు బర్త్‌డే విషెస్‌ చెప్పింది మూవీ టీమ్​. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

ఇక 'సూర్య 44'ను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డేతో పాటు మలయాళ స్టార్ హీరో జోజు జార్జ్‌, జయరామ్‌ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, సూర్య డిఫరెంట్​ పాత్రలో నటించిన 'కంగువ' మూవీ దసరా కానుకగా అక్టోబరు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాలో యంగ్ హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, ట్రైలర్ ఈ మూవీపై అభిమానుల్లో మరింత అంచలాను పెంచేసింది.కంగ అనే ఓ పరాక్రముడి కథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో సూర్య ఆరు విభిన్న లుక్స్‌లో కనిపిస్తారని సినీ వర్గాల టాక్ . ఇప్పటికే మేకర్స్ కూడా రెండు ఇంట్రెస్టింగ్​ లుక్స్​ను అభిమానుల కోసం రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

Hero Suriya Blood Bank :తాజాగా సూర్య తన అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పుట్టిన రోజు కోసం ఇటీవలే ఏర్పాటు చేసిన ఓ రక్తదాన శిబిరానికి హాజరయ్యారు. అంతేకాకుండా రక్తం కూడా దానం చేశారు. ఇదే క్యాంపులో 400 మంది సూర్య ఫ్యాన్స్​ కూడా బ్లడ్‌ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రతి ఏడాది తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా సూర్య ఫ్యాన్స్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటారని సమాచారం. అలా గతేడాది 2000 మంది రక్తదానం చేశారట. ఇందులో భాగంగానే అప్పట్లో సూర్య 2024లో నిర్వహించే రక్తదాన శిబిరానికి హాజరవుతానంటూ భిమానులకు మాటిచ్చారు. చెప్పినట్టుగానే వచ్చి రక్తదానం చేశారు. అభిమానులతో కలిసి కాసేపు ముచ్చటించారు.

'సూర్య 44' షురూ- లైట్స్, కెమెరా, యాక్షన్- గ్లింప్స్ చూశారా? - Suriya 44

స్టార్ హీరో కళ్లలో ఆనందం - తనయుడిని అలా చూస్తూ ఉండిపోయిన సూర్య - Suriya Son Karate

Last Updated : Jul 23, 2024, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details