తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప 2' క్లైమాక్స్​ లేటెస్ట్​ అప్డేట్​ - షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందంటే? - Pushpa 2 Shooting Update - PUSHPA 2 SHOOTING UPDATE

Pushpa 2 Shooting Update : 'పుష్ప 2' పూర్తి చేయడమే లక్ష్యంగా ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్‌ మరోసారి రంగంలోకి దిగబోతున్నారని తెలిసింది. కొత్త షెడ్యూల్ వివరాలు తెలిశాయి. పూర్తి డీటెయిల్స్​ స్టోరీలో.

source ETV Bharat
Pushpa 2 Shooting Update (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 4:49 PM IST

Pushpa 2 Shooting Update : 'పుష్ప 2' పూర్తి చేయడమే లక్ష్యంగా ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్‌ మరోసారి రంగంలోకి దిగబోతున్నారని తెలిసింది. కొత్త షెడ్యూల్​ ప్రారంభించబోతున్నట్లు సమాచారం అందింది. దర్శకుడు సుకుమార్​​ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రెండో భాగంపై అందరికీ అంతకు మించి అంచనాలు పెరిగిపోయాయి.

దీంతో పుష్ప మేకర్స్ కూడా ఎంతో జాగ్రత్తగా సినిమాను షూట్​ చేస్తూ తెరకెక్కిస్తున్నారు. మంచి అవుట్​ పుట్ కోసం చాలా వరకు సన్నివేశాలను రీషూట్ చేస్తూ శ్రమిస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ కూడా స్వయంగా ఆ మధ్య చెప్పారు.

ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న కచ్చితంగా విడుదల చేస్తామని మేకర్స్ కూడా పలు సార్లు కౌంట్​ డౌన్​ పోస్టర్లను విడుదల చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. మేకర్స్ కూడా త్వరలోనే గుమ్మడికాయ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఓ షెడ్యూల్​ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా అందించిన సమాచారం ప్రకారం ఆ కొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లు తెలిసింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ చేస్తున్నారట. ఇది పది రోజుల పాటు ఉండనుందట. వాస్తవానికి ఇప్పటికే మేకర్స్ క్లైమాక్స్ కోసం రెండు వెర్షన్లను షూట్ చేశారట. ఇప్పుడు మూడో వెర్షన్​ను చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా మరో పది రోజుల్లో మొత్తం షూటింగ్​ను ముగించనున్నారని వినికిడి. ఇందుకోసం అల్లు అర్జున్, సుకుమార్ ఫుల్ ఎనర్జిటిక్​గా, క్రియేటివ్​గా పని చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Pushpa 2 Fahadh Faasil :కాగా, ఫుష్ప 2 సినిమా విషయానికొస్తే - చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక శ్రీవల్లి 2.0గా కనిపించనున్న సంగతి తెలిసిందే. కమెడియన్ సునీల్, అనసూయ సహా పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్​ పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై రూపొందుతోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్​ అని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది. చూడాలి మరి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటుందో.

'భారతీయుడు' టీమ్ షాకింగ్ డెసిషన్​! - నిజంగానే అలా చేస్తుందా? - Bharateeyudu 3 OTT

'Swag', 'రాజ రాజ చోర'కు లింక్?!- హీరో శ్రీవిష్ణు ఏమన్నారంటే? - Sree Vishnu Swag Movie

ABOUT THE AUTHOR

...view details