Suhas Samantha :షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ఆరంభించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరోగా కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ సుహాస్. ఇప్పుడు ఈయన సినిమాలకు క్రమక్రమంగా గిరాకీ పెరుగుతోంది. ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. దీంతో బాక్సాఫీస్ ముందు ఈయన చిత్రాలకు మంచి వసూళ్లే వస్తున్నాయి.
అప్పటివరకు హీరోల ఫ్రెండ్స్ క్యారెక్టర్లో లేదంటే ఇతర పాత్రల్లో నటించిన సుహాస్ కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారారు. అలా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకుని సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నారు. అనంతరం మళ్లీ భిన్నమైన సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూనే ముందుకు వెళ్లారు. మధ్య మధ్యలో తనకు హీరోగా అవకాశం వచ్చినప్పుడల్లా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటూనే ఉంటున్నారు. అలా రైటర్ పద్మభూషణ్, రీసెంట్గా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌తో లేడీ ఆడియెన్స్‌ను మనసులను దోచుకున్నారు. ఈ జర్నీలోనే హిట్ 2 సహా మరో వెబ్‌సిరీస్‌లో నెగటివ్ షేడ్స్ ఉన్న సైకో పాత్రలను కూడా పోషించి మెప్పించారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన హీరోయిన్ సమంత గురించి మాట్లాడాడు. "సమంతను మొదటిసారి చూసినప్పుడు బాగా భయపడ్డాను. ఎలా ఉంటారో, ఏం మాట్లాడతారో అని అనుకున్నాను. నీకు ఫస్ట్ బ్రేక్ తప్పకుండా వస్తుంది. సక్సెస్ అవుతావ్ అని ఆమె నాతో చెప్పింది. తొలిసారి అలా అన్న వ్యక్తి ఆమెనే. ఆమె చెప్పినట్టుగానే జరిగింది. ఓ సారి షూటింగ్లో సమంతను చాలా మంది కలిసి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆమె చుట్టూ వాలిపోయారు. చూపించారు. ఆమె చాలా మంది ప్రేమను పొందింది. ఎంతో కష్టపడితేనె గానీ ఈ స్థాయికి వెళ్లలేం. ఆమె అంటే నాకు చాలా గౌరవం" అని చెప్పాడు.