తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

SSMB29 బిగ్ అప్డేట్​ - మూవీ అఫీషియల్ లాంఛ్​ ఆరోజే​! - SSMB29 Shooting When

SSMB29 Movie Shooting Start Date : హీరో మహేశ్​ బాబు ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​. రాజమౌళి డైరెక్షన్​​లో తెరకెక్కనున్న అడ్వెంచరస్​ ప్రాజెక్ట్​ 'SSMB29' మూవీ షూటింగ్​కు సంబంధించి ఓ బిగ్ అప్డేట్​ వచ్చింది! ఇంతకీ సినిమా షూటింగ్​ ఎప్పుటినుంచి స్టార్ట్​ కానుందంటే?

SSMB29 Movie Shooting Start Date Update
SSMB29 Movie Shooting Start Date

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 7:03 PM IST

SSMB29 Movie Shooting Start Date : ఇటు సూపర్​స్టార్​ మహేశ్​ బాబు ఫ్యాన్స్​తో పాటు సాధారణ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'SSMB29' మూవీ షూటింగ్​కు సంబంధించి కీలక అప్డేట్​ వచ్చింది. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్​ను ఏప్రిల్​ 9న ఉగాది సందర్భంగా మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. పూజా కార్యక్రమాలతో మూవీని గ్రాండ్​గా లాంఛ్​ చేయబోతున్నారట. ఇదే రోజు ప్రాజెక్టుకు సంబంధించి మరో అప్డేట్​ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇది తెలుసుకుంటున్న మహేశ్​ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సినిమా కోసం 2 సంవత్సరాలు
భారీ యాక్షన్​ అడ్వెంచరస్​ థ్రిల్లర్​గా పేర్కొంటున్న ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగునుందని సమాచారం. ఎక్కువ భాగం షూటింగ్​ అడవుల్లోనే జరగనుందట. ఈ మూవీతో రాజమౌళి ఇంటర్నేషనల్​ మార్కెట్​ను టార్గెట్​ చేస్తున్నారనే గాసిప్స్​ కూడా జోరందుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్​ కోసం మహేశ్​ ఏకంగా 2 సంవత్సరాలను కేటాయించనున్నట్లు తెలిసింది.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్​ వర్క్స్​ కూడా పూర్తైనట్లు రీసెంట్​గా రచయిత విజయేంద్రప్రసాద్​ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఈ సినిమా కథాంశం ఇండియానా జోన్స్​ సిరీస్​ని పోలి ఉంటుందని పేర్కొన్నారు. 'రైటర్స్​ ఆఫ్​ ది లాస్ట్​ ఆర్క్​ (1981)' తరహాలో అనేక ఎమోషన్స్​తో ఈ చిత్రం ఉండనుందని, హాలీవుడ్​కు చెందిన పలువురు నటీనటులు కూడా ఈ ప్రాజెక్ట్​లో భాగం కానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సినిమా కోసం సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్​ను ఖర్చు చేయనున్నట్లు సమాచారం. హాలీవుడ్​కు చెందిన ఓ ప్రముఖ సంస్థతో కలిసి ఈ మూవీని నిర్మించనున్నారట.

వారం రోజుల్లో రూ.200 కోట్లు
Guntur Kaaram Collections : ఇటీవల 'గుంటూరు కారం'తో సంక్రాంతి బరిలో నిలిచి ప్రేక్షకులను అలరించారు మహేశ్​ బాబు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​ తెరకెక్కించిన ఈ సినిమా మిశ్రమ రివ్యూను అందుకుంది. రిలీజైన వారం రోజుల్లోనే రూ.200 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను అందుకుంది.

టాలీవుడ్​ టాప్​-10 హీరోస్​ - నాలుగు స్థానాలు మెగా ఫ్యామిలీవే

తండ్రైన 'కలర్‌ ఫొటో' హీరో సుహాస్​ - ప్రొడక్షన్ నెం.1 అంటూ ఫొటో షేర్​

ABOUT THE AUTHOR

...view details