SSMB29 Casting Director : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రానున్న SSMB 29 గురించి రోజుకో రూమర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపించడం వల్ల ఆ రూమర్స్ కాస్త మరింతగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అటువంటి ఓ రూమర్‌కు చెక్ పెట్టింది SSMB టీమ్.
"రాజమౌళి-మహేశ్‌బాబు ప్రాజెక్ట్‌కు సంబంధించి నటీనటుల ఎంపికపై సోషల్ మీడియాలో పలు రకరకాల వార్తలను మేము గుర్తించాము. కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో వెలువడిన కథనాలు కూడా మా దృష్టికి వచ్చాయి. కాస్టింగ్ డైరెక్టర్ వీరేన్ స్వామి ఈ సినిమాలో భాగమైనట్లుగా అందులో పేర్కొన్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ మూవీకి సంబంధించి ఏ అప్‌డేట్ అయినా సరే మేమే ఇస్తాం. ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే అధికారిక ప్రకటనను తప్ప మరే ఇతర అప్‌డేట్‌లను మీరు నమ్మొద్దు" అంటూ SSMB నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్ క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమేజాన్ అడవుల నేపథ్యంలో సాగనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి 'మహారాజ్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు అప్పట్లో పలు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్‌గా, హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ కీలకపాత్ర పోషించనున్నారని కూడా నెట్టింట టాక్ నడుస్తోంది. ఇక మహేశ్‌బాబు కూడా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. తన లుక్‌ను కూడా మార్చుకున్నారు. లేటెస్ట్గా ఆయన తన కొత్త లుక్‌తో పలు ఈవెంట్స్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.