SSMB 29 Rajamouli Mahesh babu Movie : ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ SSMB29. దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఇది రాబోతుంది. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మూవీకి సంబంధించి ప్రతి చిన్న వార్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే తాజాగా రాజమౌళినే SSMB29కి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
SSMB 29 రిలీజ్ డేట్ - జపాన్‌లో మహేశ్ సినిమాపై జక్కన్న అదిరిపోయే అప్డేట్ - SSMB 29 Rajamouli Japan
SSMB 29 Rajamouli Mahesh babu Movie : మహేశ్‌బాబుతో చేయబోయే సినిమా గురించి రాజమౌళి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సినిమా పనులు ఎక్కడి వరకు వచ్చాయో క్లారిటీ ఇచ్చారు.
Published : Mar 19, 2024, 8:52 AM IST
ప్రస్తుతం రాజమౌళి జపాన్‌లో తన లాస్ట్ గ్లోబల్ హిట్ మూవీ రౌద్రం రణం రుధిరం(RRR Movie) స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. అక్కడే స్టేజ్ మీద మహేశ్‌తో చేయబోయే సినిమాకు సంబంధించి మాట్లాడారు. " స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కాస్టింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. కేవలం హీరో మాత్రమే లాక్ అయ్యారు. అతడే మహేశ్ బాబు. అతడు తెలుగు హీరో. చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. మీలో చాలా మందికే తెలిసే ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేస్తాం. ఇక్కడ కూడా రిలీజ్ చేస్తాం. అప్పుడు మహేశ్‌ను ఇక్కడికి తీసుకొస్తాను" అంటూ జక్కన్న చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది తెలుసుకుంటున్న ఫ్యాన్స్ SSMB29 హ్యాష్ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.