SS Rajamouli Netflix Documentary :టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ జక్కన్నపై ఓ డాక్యూమెంటరీని రూపొందించింది. తాజాగా ఈ విషయాన్ని ఆ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా షేర్ చేసింది. 'మోడ్రన్ మాస్టర్స్' అనే పేరుతో తెరకెక్కిన ఆ సిరీస్ ఆగస్టు 2 నుంచి ప్రసారం కానున్నట్లు పేర్కొంది.
"ఒక మనిషి. అనేక బ్లాక్‌బస్టర్‌లు. అంతులేని ఆశయం. ఈ లెజెండరీ డైరెక్టర్ ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇలాంటి అంశాలతో ఈ 'మోడ్రన్ మాస్టర్స్' రూపొందింది. అంటూ ఓ సాలిడ్ క్యాఫ్షన్ను రాసుకొచ్చింది. అయితే ఈ డాక్యూమెంటరీలో కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ రాజమౌళితో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు డాక్యూమెంటరీ విడులవ్వనుందన్న విషయం తెలుసుకున్న జక్కన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు హాలీవుడ్ డైరెక్టర్లు, సెలబ్రిటీలు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఆయనకు కంగ్రాజ్యూలేషన్స్ చెప్తున్నారు.
ఇక రాజమౌళి అప్‌కమింగ్ మూవీస్ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 'SSMB 29' తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు సన్నాహాలు కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో మహేశ్‌తో పాటు ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ నటిస్తుండగా, హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ కీలకపాత్ర పోషించనున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారమవుతోంది. లుక్ టెస్ట్ కోసం ఇప్పటికే లండన్ వెళ్లి వచ్చిన మూవీ టీమ్ ఇప్పుడు స్క్పిప్టింగ్ వర్క్‌లో నిమగ్నమైనట్లు సమాచారం. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఓ అడ్వెంచరస్ స్టోరీ ఇది అని తెలుస్తోంది. మహేశ్ కూడా తన లుక్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. జుట్టు, గడ్డంతో పాటు బాడీ బిల్డప్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కల్కితో ట్రెండింగ్‌లోకి 'రాజమౌళి మహాభారతం'- త్వరగా స్టార్ట్ చెయ్ జక్కన్న! - Rajamouli Mahabharata
'రాజమౌళి'పై ప్రభాస్ ఫన్నీ సెటైర్- దొరికితే దూల తీర్చేస్తాడంటూ! - Kalki 2898 AD