SS Rajamouli Baahubali Promotions :డైరెక్టర్ రాజమౌళి సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓ సినిమాను ఆయన ఎంత పెర్ఫెక్ట్గా తీస్తారో, అంతే విజన్‌తో ప్రమోట్ కూడా చేస్తారు. ట్రైలర్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకూ అన్నింటిలోనూ కొత్తదనాన్ని చూపిస్తారు. అందుకే ఆయన సినిమాలు ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో క్లిక్ అవుతుంటాయి.
ఇటీవలె విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఆయన పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. మూవీ టీమ్‌తో పాటు ఆయన పలు ఇంటర్వ్యూల్లో, ప్రెస్ మీట్స్‌లో మాట్లాడి ఆ చిత్రాన్ని ఓ రేంజ్లో ప్రమోట్ చేశారు. సినిమా సక్సెస్ తర్వాత కూడా ఆస్కార్ వెళ్లెంత వరకు కూడా ఆ ప్రమోషన్స్ అదే రేంజ్లో సాగింది. దీనికి దాదాపు రూ. 5 కోట్ల వరకు ఖర్చు అయ్యిందని సినీ వర్గాల టాక్. అయితే 'బాహుబలి' సినిమాకు ఆయన ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఆయన ఆ చిత్రానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదట. కేవలం మౌత్‌టాక్‌తోనే ఆ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చిందట. తాజాగా ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి స్వయంగా వెల్లడించారు.
"నేను ఎప్పుడు నా సినిమాల నుంచి ఎక్కువ ఆశించను అలాగని తక్కువ కూడా ఆశించను. నేను ఎల్లప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉండటానికి ప్రయత్నిస్తాను. నా మూవీస్‌కు కొత్త ప్రేక్షకులను ఎలా తీసుకురావాలనే ఆలోచన నా మదిలో ఎప్పుడూ ఉంటుంది. ఇక బాహుబలి ప్రమోషన్ కోసం మా టీమ్ అస్సలు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అలాగే ఎటువంటి ఆన్లైన్ సైట్స్‌కు కూడా డబ్బు ఇవ్వలేదు. కానీ ఆ సినిమా ప్రమోషన్ కోసం చాలా హోమ్ వర్క్ చేశాము." అని జక్కన్న తెలిపారు.