Roshan Champion Movie:సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు యంగ్ హీరో రోషన్ తదుపరి చిత్రం 'ఛాంపియన్' ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో శనివారం అధికారికంగా ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పూజా కార్యక్రమానికి హాజరై ఫస్ట్ క్లాప్ కొట్టారు. కాగా, ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ స్వప్న దత్ నిర్మిస్తున్నారు.
కాగా, ఈ సినిమాకు డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఆయితే గతేడాది రోషన్ బర్త్ డై సందర్భంగానే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ పలు కారణాల వల్ల ఆలస్యం ఇప్పటివరకూ అవుతూ వచ్చింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. అయితే ప్రస్తుతానికి హీరో తప్పా మిగతా నటీనటుల వివరాలు మేకర్స్ వెల్లడించలేదు.
బ్లాక్‌బస్టర్ వెబ్‌సిరీస్ రైటర్
అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ప్రదీప్ అద్వైతం ఇదివరకు పలు సినిమాలకు రైటర్‌గా పనిచేశారు. ఇటీవల తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్‌కు ప్రదీప్ రైటర్‌గా చేశారు. అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, ప్రియ దర్శి ఈ వెబ్ సరీస్‌లో నటించారు. రెండు సీజన్లుగా రిలీజైన ఈ సిరీస్‌కు తెలుగు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.