MathuVadalara 2 Collections : క్రైమ్, కామెడీ మూవీ 'మత్తు వదలరా 2' తాజాగా థియేటర్లలో రిలీజై పర్వాలేదనిపించే టాక్‌ను దక్కించుకుంది. అయితే ఇది చిన్న సినిమానే అయినప్పటికి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్‌ను అందుకుంది. తొలి రోజు వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి ఈ 'మత్తు వదలరా 2'లో కథానాయకుడిగా నటించారు. సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. కమెడియన్స్ సత్య, వెన్నెల కిషోర్ ఇతర పాత్రలు పోషించారు. రితేశ్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం.
అయితే ఈ చిత్రానికి మొదటి నుంచి కాస్త గట్టిగానే ప్రమోషన్స్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళిని కూడా ఉపయోగించుకున్నారు. టీజర్, ట్రైలర్ కూడా బానే ఆకట్టుకుంది. దీంతో మత్తు వదలరా 2పై హైప్ పెరిగింది. అందుకు తగ్గట్టే ఫస్ట్ షో నుంచే మంచి స్పందనను అందుకుంది. శ్రీసింహా, సత్య నటనే సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని రివ్యూలు వచ్చాయి. సత్య టైమింగ్ కామెడీ బాగుందని అంటున్నారు. ఫరియా అబ్దుల్లా కామెడీతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్‌లోనూ కనిపించిందట. రోహిణి, సునీల్, వెన్నెల కిశోర్, అజయ్ పాత్రలు కూడా కథలో కీలకంగానే ఉన్నాయట. మొత్తంగా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి భాగంతో పోలిస్తే కాస్త తక్కువనే అంటున్నారు.