Sreeleela Bollywood Movie :యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్లో దుసుకుపోతోంది. తన నటనతో, డ్యాన్స్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా కోలీవుడ్లోకి అడుగుపెట్టింది. అయితే త్వరలోనే తను హిందీ ఇండస్ట్రీలోకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి పలు రూమర్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇటీవలె బీటౌన్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఆఫీస్ వద్ద శ్రీలీల కనిపించిందట. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌తో కలిసి ఆమె అక్కడ ఉన్నట్లుగా పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. నెటిజన్లు కూడ ఈ విషయం గురించి తెగ చర్చించుకోవడం మొదలెట్టారు. ఈ ఇద్దరూ కలిసి కొత్త సినిమాలో నటించనున్నారంటూ మాట్లాడుకోసాగారు. అయితే అది కేవలం రూమర్స్ మాత్రమే అని తెలుస్తోంది.
ఆ హిట్ హీరో మూవీ ఫిక్స్!
బాలీవుడ్ వర్గాల సమచారం ప్రకారం టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో ఓ సినిమా చేయనున్నారట. దాని కోసం శ్రీలీలను సంప్రదించగా, దానికి ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే ఈ మాట విన్న శ్రీలీల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస హిట్‌లతో దూసుకెళ్తున్నరని, ఆయన సరసన శ్రీలీల డెబ్యూ మంచి ఆలోచన అని అంటున్నారు.