SPB Death Anniversary :సినీ పరిశ్రమలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు సినీ సంగీతానికి పునాది వేస్తే, ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించింది మాత్రం ఎస్పీ బాలు అనే చెప్పాలి. ఎన్నో వేల పాటలు పాడిన ఈ మధుర గాయకుడిని మనం కోల్పోయి నాలుగేళ్లు అయిపోయింది. నేడు(సెప్టెంబర్ 25) ఆయన నాలుగో వర్థంతి సందర్భంగా ఆయన ప్రతిభకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని తెలుసుకుందాం.
బాలును గుర్తుచేసుకుంటూ ఆయన ట్యాలెంట్ గురించి ఓ సందర్భంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. 15 నిమిషాల్లోనే బాలు పాటను నేర్చుకునేవారని, పది నిమిషాల్లో దాన్ని పాడేవారని పేర్కొన్నారు.
"నేను కెరీర్ ప్రారంభిస్తున్న రోజుల్లో రోజా మూవీ కోసం సంగీత దర్శకుడిగా పనిచేశాను. ఆ చిత్రంలోని పాట రికార్డింగ్ కోసం బాలు సర్ స్టూడియో దగ్గరికు వచ్చారు. అక్కడి వాతావరణం చూసి, ఇక్కడ మ్యూజిక్ రికార్డింగ్ చేస్తారా అని నన్ను అడిగారు. దానికి నేను నవ్వాను. ఆ తర్వాత రోజా మూవీ రిలీజ్ తర్వాత సర్ నా దగ్గరికి వచ్చి, సంగీతాన్ని ఎక్కడైనా సృష్టించొచ్చని చెప్పారు.
బాలు సర్ 15 నిమిషాల్లోనే పాటను నేర్చుకునేవారు. పది నిమిషాల్లో పాడేసేవారు. వెంటనే మరో రికార్డింగ్‌లోకి వెళ్లిపోయేవారు. అంత వేగంగా పాటలు పాడే గాయకుడిని, వృత్తిపట్ల నిబద్ధత ఉన్న వ్యక్తిని మళ్లీ చూడలేదు." అని ఓ సందర్భంలో చెప్పారు.
సర్జరీ జరిగిన వెంటనే -కొన్నేళ్ల క్రితం ఎస్పీబీకి వోకల్ కార్డ్స్‌కు సంబంధించి గొంతులో ఓ సమస్య వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో తాను పాటలు పాడలేక ఇబ్బండి పడినట్లు గుర్తుచేసుకున్నారు. దీంతో స్పెషలిస్ట్‌ను సంప్రదిస్తే సర్జరీ చేయాలని చెప్పారట. కానీ సర్జరీ చేసిన తర్వాత పాటలకు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడొచ్చని కూడా అన్నారట. అదే సమయంలో ఈ విషయం తెలుసుకున్న లతా మంగేష్కర్, ఎస్పీబీకి ఫోన్ చేసి సర్జరీ వద్దని సలహా ఇచ్చారట. కానీ ఎస్పీబీ రిస్క్ చేసి మరీ సర్జరీ చేయించుకున్నారు. అప్పుడు డాక్టర్ కొంత విశ్రాంతి తీసుకోమని చెబితే, వినకుండా ఆపరేషన్ జరిగిన వెంటనే పాడడం మొదలుపెట్టానని ఓసారి ఎస్పీబీనే తెలిపారు.
SPB Death Anniversary : కృష్ణతో ఎస్పీబీ వివాదం.. ఆ ఫోన్ కాల్‌తో ఇండస్ట్రీయే నలిగిపోయేలా!.. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే?
ఆయన ఇచ్చిన మంత్రోపదేశమే ఎస్పీబీ టర్నింగ్ పాయింట్.. అందుకే NTR, ANR టు చిరు, బాలయ్య క్యూ కట్టేవారు