తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మహేశ్​, నయన్, యశ్​ - వీరందరూ బాలీవుడ్ సినిమాలకు నో ఎందుకు చెప్పారో తెలుసా? - SOUTH STARS REJECTING HINDI MOVIES

మహేశ్​, నయన్, యశ్​ - వీళ్లందరూ ఒకప్పుడు హిందీ సినిమాలను కాదన్నారట - ఎందుకో తెలుసా?

South Stars Rejecting Hindi Movies
South Stars Rejected Hindi Movies (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 7:15 PM IST

South Stars Who Rejected Bollywood Movies : ఒకప్పటి హీరోలు, హీరోయిన్లు ఏడాదికి సులువుగా ఐదు కంటే ఎక్కువ సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏడాదికి ఓ సినిమా చేయడమే కష్టమైపోయింది. పైగా ఇప్పుడన్నీ పాన్ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో దీంతో హీరోలు, హీరోయిన్లు ఒక్క ప్రాజెక్ట్​పైనే దృష్టి సారించి కొన్ని సార్లు మిగతా ప్రాజెక్టులు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే అభిమానులకు తమ అభిమాన తారలను కొత్త పాత్రలు, కాంబోల్లో చూసే అవకాశం కలుగుతోంది. రష్మిక మందన్న, ప్రభాస్, సల్మాన్ ఖాన్ వంటి నటీనటులు భాషలకు సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ప్రతి దక్షిణాది నటులు బాలీవుడ్‌లో పనిచేసే అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. కొందరు వివిధ కారణాలతో పెద్ద ప్రాజెక్ట్‌లను రిజెక్ట్‌ చేశారు. వ్యక్తిగత ప్రాధాన్యతలు, షెడ్యూల్ కుదరకపోవడం, సొంత పరిశ్రమపై విధేయత వంటి కారణాలు ఉన్నాయి. అలా బీటౌన్​లో కొన్ని బడా ప్రాజెక్టులను వదులుకున్న స్టార్స్ ఎవరో చూద్దామా?

మహేశ్​ బాబు
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్​ సందీప్‌ రెడ్డి వంగ రూపొందించిన 'యానిమల్‌' మూవీ కోసం తొలుత మహేశ్​ బాబునే సంప్రదించారట. అయితే తనకు ఆ రోల్‌ చాలా డార్క్‌గా ఉంటుందని మహేష్‌ పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాను తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, దక్షిణాదిలో తన కెరీర్‌తో సంతోషంగా ఉన్నానని స్పష్టం చేసినట్లు సమాచారం.

అనుష్క శెట్టి
తెలుగు, తమిళ సినిమాల్లో టాప్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టికి బాలీవుడ్​ 'సింగం'లో అజయ్ దేవగన్ సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే ఆమె ఆఫర్‌ని అంగీకరించలేదు. దీంతో ఆ పాత్ర కాజల్ అగర్వాల్‌కి చేరింది. ఇదే కాకుండా 'తమాషా' సినిమాలో పాత్ర, కరణ్ జోహార్‌ తెరకెక్కించిన ఓ మూవీని కూడా అనుష్క కాదన్నట్లు తెలిసింది.

అల్లు అర్జున్
టాలీవుడ్‌ స్టార్‌ హీరో, 'పుష్ప' దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కూడా బీటౌన్​లో ఓ బడా ఆఫర్​ను రిజెక్ట్ చేశారట. సల్మాన్ ఖాన్ నటించిన 'బజరంగీ భాయిజాన్' సినిమాలో లీడ్​ రోల్​ను ఆయన కాదన్నారట. అయితే ఈ మూవీ బాలీవుడ్‌లో భారీ హిట్‌ అందుకుంది. అయితే సల్మాన్ రోల్​ కోసం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను కూడా మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది.

దర్శన్
కన్నడ నటుడు దర్శన్‌కి 'దబాంగ్ 3'లో విలన్ పాత్ర చేసే అవకాశం వచ్చింది. అయితే దాన్ని ఆయన తిరస్కరించడం వల్ల ఆ పాత్రని కిచ్చ సుదీప్‌ చేశారు.

నయనతార
'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'లోని ఓ గెస్ట్ రోల్‌ కోసం నయనతారను సంప్రదించారట. అయితే ఆమె పెద్ద పాత్ర కావాలని ఆ ఆఫర్‌ను తిరస్కరించారట.

యశ్‌
'లాల్ కప్తాన్‌' అనే సినిమాలోని ప్రధాన పాత్ర కోసం నిర్మాతలు మొదట కన్నడ స్టార్ యశ్‌ని సంప్రదించారట. అయితే ఆయన కాదనడం వల్ల ఆ రోల్​కు సైఫ్ అలీ ఖాన్‌ ఫైనలైజ్ అయ్యారట.

ఫ్యామిలీతో చూసే థ్రిల్లర్ మూవీ - రూ.7 కోట్లకు రూ.75 కోట్ల వసూళ్లు - ఏ OTTలో స్ట్రీమింగ్ అంటే?

స్పై థ్రిలర్ కంటెంట్ కోసం చూస్తున్నారా? ఓటీటీలో ఈ సినిమాలు డోంట్​ మిస్!

ABOUT THE AUTHOR

...view details