Prasanth Varma Movie :నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రానికి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయనున్నారు. ఈ చిత్రంపై కొన్ని రోజులుగా రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై నిర్మాణ సంస్థ ఎస్‌ఎల్‌వీ సినిమాస్ తాజాగా స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.
మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా - 'వాటిని నమొద్దు' - PRASANTH VARMA MOKSHAGNA MOVIE
నందమూరి మోక్షజ్ఞ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించనున్న మూవీపై వస్తున్న రూమర్స్‌కు స్పందించిన నిర్మాణ సంస్థ.

Mokshagna Teja (source Prasanth Varma Twitter)
Published : Dec 18, 2024, 9:34 PM IST
"మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు గురించి ఊహాగానాలు వచ్చాయి. వాటిలో నిజం లేదు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనలు/అప్‌డేట్స్‌ను @SLVCinemasOffl @LegendProdOffl సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మీకు తెలియజేస్తాం. అసత్య ప్రచారాన్ని ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం" అని పేర్కొంది.
ఆదిత్య 369 సీక్వెల్ రిలీజ్ డేట్ - బాలయ్య ఆసక్తికర సమాధానమిదే