Amaran Movie Sai Pallavi Phone Number : 'అమరన్' సినిమాలో చూపించిన ఓ ఫోన్ నంబర్ విషయంలో ఇటీవలె జరిగిన వివాదంపై మేకర్స్ తాజాగా స్పందించారు. ఈ క్రమంలో ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ వివాదానికి కారణమైన నంబర్‌ను ఓటీటీ వెర్షన్లో బ్లర్ చేసింది. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట తెగ వైరల్ అవ్వగా, నెటిజన్లను రకరకాలుగా స్పందిస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే?
'అమరన్'లోని హే మిన్నలే పాటలో హీరోయిన్ ఓ కాగితంపై తన ఫోన్ నంబర్ రాసి శివ కార్తికేయన్‌కు ఇస్తుంది. అయితే ఈ సినిమా విడుదలయ్యాక ఆ నంబర్ సాయిపల్లవిదేనని భావించిన పలువురు అభిమానులు ఆ నంబర్‌కు ఫోన్ కాల్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ నంబర్ తనదేనని, దానికి గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, సందేశాల వస్తున్నానయని, దాని వల్ల తనకు వ్యక్తిగత ప్రశాంతత లేకుండాపోయిందంటూ చెన్నైకు చెందిన విఘ్నేశన్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
దాదాపు నాలుగు వేల కాల్స్ తనకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు రూ.1.1 కోటి పరిహారం కోరుతూ మూవీ టీమ్‌కు లీగల్ నోటీసులను సైతం పంపించాడు. అయినప్పటికీ టీమ్ నుంచి స్పందన లేకపోవడం వల్ల ఇటీవల అతడు మద్రాస్ హైకోర్టులో ఈ విషయంపై దావా వేశాడు. ఈ క్రమంలోనే తాజాగా టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్న ఈ సినిమాలోని ఆ నంబర్‌ను కాస్త బ్లర్ చేసింది. అంతేకాకుండా యూట్యూబ్‌లోనూ ఈ పాటకు సంబంధించిన వీడియోలోనూ నంబర్‌ను పూర్తిగా బ్లర్ చేసింది.