తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అమరన్‌ అద్భుతం - శివకార్తికేయన్‌, సాయిపల్లవి నటన సూపర్' : సీఎం స్టాలిన్ - AMARAN MOVIE REVIEW

'అమరన్‌' సినిమాపై ప్రశంసలు కురిపించిన సీఎం స్టాలిన్.

Amaran Movie Review CM Stalin
Amaran Movie Review CM Stalin (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2024, 11:59 AM IST

Amaran Movie Review CM Stalin : దీపావళి కానుకగా బాక్సాఫీస్ ముందుకు వచ్చిన చిత్రాల్లో అమరన్ కూడా ఒకటి. ఉగ్ర దాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితాధారంగా తెరకెక్కిన సినిమా 'అమరన్‌'. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రమిది. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్​ను అందుకుంటోంది. సోషల్ మీడియాలో అంతటా పాజిటివ్ రివ్యూలు కనపడుతున్నాయి. హీరో శివ కార్తికేయన్ కెరీర్​లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుందని అంతా కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ (Tamilnadu CM Stalin) కోసం మూవీ టీమ్ స్పెషల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేసింది. స్టాలిన్‌, ఉదయనిధితో పాటు చిత్ర బృందం ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం సినిమా చూసి ముఖ్యమంత్రి స్టాలిన్​ తమను ఎంతగానో మెచ్చుకున్నారని శివ కార్తికేయన్‌ మీడియాతో చెప్పారు.

మేజర్‌ ముకుంద్‌ జీవితాన్ని తెరపై ఎంతో గొప్పగా చూపించారని ప్రశంసించినట్లు పేర్కొన్నారు కార్తికేయన్. ఆయన మాటలు ఆనందాన్ని కలిగించాయని తెలిపారు. ఇదే సమయంలో చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ స్టాలిన్‌ సినిమా గురించి తాజాగా పోస్ట్‌ పెట్టారు. 'అమరన్‌ను అద్భుతంగా చిత్రీకరించారు. సాయిపల్లవి, శివ కార్తికేయన్‌ నటన బాగుంది' అని మెచ్చుకున్నారు.

కాగా, 2014లో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ముకుంద్‌ వరదరాజన్‌ కన్ను మూశారు. అప్పుడు దేశానికి ముకుంద్​ అందించిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనకు అశోక చక్రాను ప్రకటించింది. ఇకపోతే ముకుంద్‌ వరదరాజన్​ బయోపిక్​లో భాగం కావడంపై శివ కార్తికేయన్‌ స్పందించారు. ఈ దేశం కోసం ముకుంద్‌ అందించిన సేవలు, ఆయన త్యాగాన్ని తెలియజేసేలా సినిమాను తెరకెక్కించడం భావోద్వేగంతో కూడుకున్నది. ఈ చిత్రంలో భాగమైనందుకు గర్విస్తున్నానని అన్నారు.

ముకుంద్‌ వరదరాజన్‌ సతీమణి ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా చూసిన వారు సాయి పల్లవి నటనను కూడా ప్రశంసిస్తున్నారు.

'క' రివ్యూ - కిరణ్‌ అబ్బవరం కొత్త కాన్సెప్ట్​ సినిమా ఎలా ఉందంటే?

'లక్కీ భాస్కర్‌' రివ్యూ - సినిమాకే అది హైలైట్

ABOUT THE AUTHOR

...view details