Sitara Guntur Kaaram :టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు గారాల పట్టి సితార మరోసారి తన మంచి మనసును చాటుకుంది. పలువురు అనాథ పిల్లలతో కలిసి సితార 'గుంటూరు కారం' సినిమా చూసింది. వారి కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్‌లో ఆ చిన్నారులతో కలిసి సందడి చేసింది. ఆ తర్వాత వారితో సరదాగా ముచ్చటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చూసిన ఆడియెన్స్ సితార మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. తను చేసిన ఈ మంచి పనికి ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.
మహేశ్ కుమార్తె మంచి మనసు - అనాథలతో 'గుంటూరు కారం' చూసిన సితార - అనాధ పిల్లలతో సితార గుంటూరు కారం
Sitara Guntur Kaaram : సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార మరోసారి తన మంచి మనసును చాటుకుంది. అనాథ పిల్లలకు ఏర్పాటు చేసిన 'గుంటూరు కారం' స్పెషల్ స్క్రీనింగ్స్‌లో వారితో కలిసి సినిమా చూసింది.
Published : Jan 21, 2024, 1:00 PM IST
|Updated : Jan 21, 2024, 1:51 PM IST
అప్పుడు కూడా ఇలానే
Sitara Donations : అయితే సితార కూడా తన తండ్రిలా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఇటీవలే తన పుట్టిన రోజు సందర్భంగా పలువురు విద్యార్థులను ఇంటికి పిలిచి వారి సమక్షంలో కేక్ కట్ చేసింది. అంతే కాకుండా ఆ స్టూడెంట్స్‌కు సైకిళ్లు అందజేసింది. ఇక తాను చేసిన ఓ జ్యూయెలరీ యాడ్‌కు వచ్చిన రెమ్యూనరేషన్‌ను కూడా సేవా కార్యక్రమాలను వినియోగించనున్నట్లు ప్రకటించింది. మరోసారి తన తండ్రి ఫౌండేషన్‌కు తన నెల పాకెట్ మనీ ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకుంది. ఇలా సమయం వచ్చినప్పుడల్లా తనవంతు సహాయాన్ని అందిస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది సితార.
Sitara Guntur Kaaram Dance : సూపర్ స్టార్ మహేశ్ బాబు - నమ్రత గారాలపట్టి అయిన సితార సినిమాల్లోకి రానప్పటికీ ఈ చిన్నారికి నెట్టింట సూపర్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ డాటరే అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటూ తనకున్న టాలెంట్, స్పెషల్ స్కిల్స్‌తో అతి చిన్న వయసులోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే కూచిపూడి డ్యాన్సర్‌గా, సోషల్ మీడియా స్టార్‌గా మస్త్ పాపులారిటీ సంపాదించుకున్న సితార తన ఫోటోలు, డ్యాన్స్ రీల్స్‌తో ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. తాజాగా గుంటూరు కారంలో 'ఓ మై బేబీ' సాంగ్‌కు సూపర్ స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.