Sitara Ghattamaneni Birthday :టాలీవుడ్ స్టార్ హీరోమహేశ్‌బాబు కుమార్తె సితార బర్త్‌డే సందర్బంగా ఆమె తండ్రి మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు. సితార లేటెస్ట్ ఫొటో షేర్ చేసి 'హ్యాపీ 12 మై సన్‌షైన్' అని పేర్కొన్నారు.
ఇక సితార తల్లి నమ్రత శిరోద్కర్ కూడా ఇన్‌స్టా వేదికగా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. సితార చిన్నప్పటి ఫొటోలతో పాటు కొన్ని స్పెషల్ వీడియోలతో ఆ వీడియోను ఎంతో క్రియేటివ్‌గా ఎడిట్ చేశారు. "నా చిట్టి ట్రావెల్ పార్ట్నర్కి జన్మదిన శుభాకాంక్షలు. వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు నువ్వు ఎప్పుడూ నాకు ఓ ట్రావెల్ గైడ్‌లా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకం చేశావు. ఈ క్షణాలు, జ్ఞాపకాలను నేను సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఐ లవ్ యూ మై స్వీట్‌హార్ట్" అని నమ్రత తన కుమార్తె కోసం ఓ క్యాప్షన్ రాసుకొచ్చారు.
ఈ రెండూ పోస్ట్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవ్వగా, మహేశ్ అభిమానులు, నెటిజన్లు సితారు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఆ పోస్ట్‌లను మరింత వైరల్ చేస్తున్నారు.