తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సైమా అవార్డ్ విన్నింగ్ 'భగవంత్ కేసరి'- ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా? - 2024 SIIMA Awards

Bhagavanth Kesari 2024 SIIMA : నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'భగవంత్ కేసరి' సినిమా 2024 సైమా అవార్డ్స్​లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మరి ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందో తెలుసా?

Bhagavanth Kesari SIIMA
Bhagavanth Kesari SIIMA (Source: Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2024, 6:59 AM IST

Updated : Sep 16, 2024, 7:31 AM IST

Bhagavanth Kesari 2024 SIIMA :నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'భగవంత్ కేసరి' సినిమా 2024 సైమా అవార్డ్స్​లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని సందేశాత్మకందా తెరకెక్కించారు. 2023లో రిలీజైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి భారీ విజయం దక్కించుకుంది. మరి సైమా అవార్డ్స్​లో ఉత్తమ చిత్రంగా సత్తా చాటిన బాలయ్య 'భగవంత్ కేసరి' సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్​ అవుతోంది. గతేడాది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దే కాదు, ఓటీటీలోనూ రికార్డులు సృష్టించింది. 2023 నవంబర్​లో గూగుల్​లో అత్యధిక మంది సెర్చ్ చేసిన చిత్రంగానూ నిలిచింది. ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. వరల్డ్​వైడ్​గా ఈ సినిమా రూ. 140కోట్లకుపైగా గ్రాస్ వసూల్ చేసింది. ఇక బాలయ్యతోపాటు కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు ఈ సినిమాలో నటించారు.

Nani 2024 SIIMA :నేచురల్ స్టార్ నాని ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆయన లీడ్​లో తెరకెక్కిన దసరా సినిమాకుగాను ఈ అవార్డు వరించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్​గా నటించిన కీర్తి సురేశ్​కు ఉత్తమ నటి అవార్డు దక్కింది. వీరితోపాటు సైమాలో అవార్డులు దక్కిన సినిమాలు, నటీనటులు ఎవరంటే?

  • ఉత్తమ దర్శకుడు - శ్రీకాంత్‌ ఓదెల (దసరా)
  • ఉత్తమ సహాయ నటుడి- దీక్షిత్ శెట్టి (దసరా)
  • ఉత్తమ పరిచయ దర్శకుడు - శౌర్యువ్ (హాయ్ నాన్న)
  • ఉత్తమ నటి క్రిటిక్స్‌ - మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న)
  • ఉత్తమ సహాయ నటి - బేబీ కియారా (హాయ్ నాన్న)
  • ఉత్తమ సంగీత దర్శకుడు - అబ్దుల్‌ వహాబ్ (హాయ్ నాన్న)
  • ఉత్తమ డెబ్యూ ప్రొడ్యూసర్‌ - విజేందర్‌ రెడ్డి (హాయ్ నాన్న)
  • ఉత్తమ నటుడు క్రిటిక్స్ - ఆనంద్ దేవరకొండ (బేబి)
  • ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ - సాయి రాజేశ్ (బేబి)
  • ఉత్తమ డెబ్యూ నటి - వైష్ణవి (బేబి)
  • ఉత్తమ లిరిక్స్‌ రైటర్‌ - అనంత శ్రీరామ్‌ (బేబి)
  • ఉత్తమ పరిచయ నటుడు- సంగీత్‌ శోభన్‌ (మ్యాడ్)
  • ఉత్తమ హాస్య నటుడు - విష్ణు
  • సెన్సేషన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్- సందీప్‌ రెడ్డి వంగా
  • ఉత్తమ ఛాయాగ్రాహకుడు - భవన్‌ గౌడ (సలార్)
  • ఉత్తమ గాయకుడు- రామ్‌ మిర్యాల (బలగం)

ఓటీటీలోనూ దుమ్మురేపిన బాలకృష్ణ- గూగుల్​లో 'భగవంత్​ కేసరి' హవా!

ఎన్టీఆర్‌ పురస్కారాలు- బేబీకి 2 అవార్డులు- మురళీ మోహన్​కు లైఫ్ ఎఛీవ్​మెంట్​!

Last Updated : Sep 16, 2024, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details