Siddu Jonnalagadda Marriage : డీజే టిల్లులో సిద్ధు జొన్నలగడ్డ- రాధికల మధ్య వచ్చే సీన్స్‌ను ఇప్పటికీ మరిచిపోలేరు చాలామంది ఆడియెన్స్. అంతలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది ఆ సినిమా. దీనికి ప్రధాన కారణం సినిమాను అంత డెడికేషన్‌తో చేశారు సిద్ధు జొన్నలగడ్డ అని చెబుతారు చాలామంది. అందుకేనేమో సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక దీనికి సీక్వెల్‌గా మరికొన్ని రోజుల్లో టిల్లు స్క్వేర్ కూడా రాబోతోంది.
ఇదిలాఉంటే ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే సిద్ధు పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఆయన సోదరుడు చైతన్య జొన్నలగడ్డ. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధు వివాహంపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
'అన్ని సెట్ అయితే అప్పుడే పెళ్లి'
'మీ తమ్ముడు సిద్ధు ఎవరో స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారట, త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. దీనికి సంబంధించి వార్తలు కూడా వస్తున్నాయి' అని యాంకర్ చైతన్యను అడిగారు. దీనికి స్పందించిన ఆయన స్టార్ హీరోయిన్ను పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్ లేదు కానీ, స్టార్ హీరోను చేసుకుంటేనే ప్రాబ్లమ్ కదా అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. అయితే పెళ్లి ప్రతిపాదన వాస్తవమే అయినా, పార్ట్నర్ మాత్రం స్టార్ హీరోయిన్ ఆ కాదా అనేది తనకు తెలియదని చెప్పారు. సిద్ధుకు కూడా వివాహంపై ఆసక్తి ఉందని, అన్ని కుదిరితే వచ్చే ఏడాదే తన తమ్ముడి పెళ్లి జరిగిపోవచ్చని మాత్రం క్లారిటీ ఇచ్చారు సిద్ధు అన్న చైతన్య జొన్నలగడ్డ.