Shraddha Kapoor Boyfriend : బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్, సినీ రచయిత రాహుల్ మోదీ గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. దానికి తగ్గట్లుగా ఈ జంట చాలా పార్టీల్లో కనిపించి సందడి చేసింది. అంతే కాకుండా ఆమె 'R' లెటర్ ఉన్న ఓ లాకెట్‌ను ధరించింది. దీంతో వారి రిలేషన్‌పై వస్తున్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే తాజాగా ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో శ్రద్ధా తన రిలేషన్‌ను దాదాపు కన్‌ఫర్మ్ చేసేసింది.
లేటెస్ట్ పోస్ట్‌లో శ్రద్ధా కపూర్, మోదీతో ఉన్న ఓ ఫొటోని షేర్ చేసింది. దానికి 'దిల్ రఖ్ లే, నీంద్ తో వాపిస్ దే దే యార్' (నా హృదయాన్ని ఉంచుకో, కానీ నన్ను నిద్ర పోనివ్వు) అనే క్యాప్షన్‌తో పాటు, రెడ్ హార్ట్ ఎమోజీలను జోడించింది. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఎలా కలిశారంటే?
సినీ వర్గాల సమాచారం ప్రకారం శ్రద్ధా, రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్స్‌లో వచ్చిన 'తూ ఝూటి మైన్ మక్కార్' సినిమాకు రాహుల్ మోదీనే రచయిత. అక్కడే వీరికి పరిచయం పెరిగింది. షూటింగ్ సమయంలో పెరిగిన సన్నిహిత్యంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చాలా ఈవెంట్స్‌లోనూ వీరు కలిసి కనిపించారు. జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లోనూ ఈ జంట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇలా ఈ జంట ఎప్పటికప్పుడూ నెట్టింట ట్రెండ్ అవుతూనే వచ్చింది. చూడాలి ఇప్పటికైనా తమ రిలేషన్షిష్ గురించి వీళ్లిద్దరూ ఓపెన్ అవుతారో లేదో?