Bharateeyudu 3 OTT : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'భారతీయుడు 2' ఇటీవలే థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ ఈ చిత్రానికి సీక్వెల్‌గా భారతీయుడు 3 రానున్నట్లు థియేటర్లలోనే ప్రకటించింది మూవీ టీమ్. అయితే తాజాగా ఈ మూడో భాగం గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.
అదేంటంటే? - భారతీయుడు 2 షూటింగ్‌తో పాటే భారతీయుడు 3ను కూడా షూట్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. సెకండ్ పార్ట్ విడుదలైన ఆరు నెలలకు మూడో భాగాన్ని విడుదల చేయాలని మూవీ టీమ్ భావించిందట. కానీ భారీ అంచనాలతో విడుదలైన భారతీయుడు 2 ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో భారతీయుడు 3 రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది.
ఈ క్రమంలోనే తాజాగా 'భారతీయుడు 3'ను నేరుగా ఓటీటీలోకి వదలాలని చిత్ర బృందం భావిస్తోందట. దీని కోసం ఈ చిత్రం నిర్మాణ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరుపుతోందని సమాచారం అందింది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకైతే నిర్మాణ సంస్థ గానీ నెట్‌ఫ్లిక్స్ గానీ స్పందించలేదు. కానీ మరోవైపు మరికొన్ని వెబ్సైట్లు ఇందులో నిజం లేదని కూడా చెబుతున్నాయి. సినిమా డైరెక్ట్‌గా థియేటర్లలోనే విడుదల అవుతుందని అంటున్నారు.