Saripodhaa Sanivaaram Priyanka Arul Mohan :తెలుగు సినిమాలతో ఎంతోమంది హీరోయిన్లు పరిచయమవుతుంటారు. వారిలో చాలా తక్కువ మంది 'చూడటానికి తెలుగమ్మాయిలా ఉందే' అని అనిపించుకుంటారు. అలాంటి వారిలో ప్రియాంక అరుల్ మోహన్ ఒకరు. ఆమెను చూస్తే అచ్చమైన తెలుగమ్మాయిలానే కనిపిస్తుంది.
నానీ గ్యాంగ్ లీడర్‌తో తెలుగు పరిశ్రమకు పరిచయమైందీ ముద్దుగుమ్మ. అందం, అమాయకత్వం, సహజత్వంతో కూడిన ఆమె నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడీ భామ త్వరలోనే(ఆగస్ట్ 29) సరిపోదా శనివారం అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. నాని హీరోగా, ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రానుంది ఈ యాక్షన్ థ్రిల్లర్.
అయితే ఈ ముద్దుగుమ్మ సరిపోదా శనివారంతో పాటు తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీలోనూ(OG Movie Priyanka Mohan) నటిస్తోంది. దీంతో ఈ భామను తాజా ఇంటర్వ్యూలో ఓజీ కథ చెప్పాలని అక్కడున్న వారు అడిగారు.
దీనికి ఆమె నవ్వుతూ సమాధానం దాట వేసింది. 'పవన్ కల్యాణ్, నానికి మధ్య ఉన్న సారూప్యతలు ఏంటి?' అని మరో ప్రశ్న అడగ్గా దానికి బదులిచ్చింది. ఇద్దరూ ఎప్పుడూ తమ లక్ష్యాలు చేరుకునేందుకు కలలు కంటూ ఉంటారని చెప్పుకొచ్చింది. నాని సినిమా గురించి ఆలోచిస్తే, పవన్ కల్యాణ్ ప్రజల గురించి ఆలోచిస్తారని పేర్కొంది. తోటి నటీ నటులకు ఇద్దరూ ఎంతో మర్యాద ఇస్తారు అని చెప్పింది. ప్రస్తుతం ఈ ఆన్సర్ నెట్టింట్లో నాని, పవన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.