తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సారీ, నేను ఆ మాట ఇవ్వలేను! : ఫ్యాన్స్​తో హీరో నాని - Nani Saripoda Sanivaram Movie - NANI SARIPODA SANIVARAM MOVIE

Nani Saripoda Sanivaram Movie : 'సరిపోదా శనివారం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు హీరో నాని. సినిమా విడుదల సందర్భంగా ఎక్స్‌ వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. అయితే ఆ ప్రామిస్ చేయలేనని అంటున్నారు నేచురల్ స్టార్. ఇంతకీ అదేంటంటే?

source ETV Bharat
Nani Saripoda Sanivaram Movie (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2024, 8:00 AM IST

Nani Saripoda Sanivaram Movie : 'సరిపోదా శనివారం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు హీరో నాని. వివేక్‌ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రమిది. ప్రియాంకా మోహన్‌ హీరోయిన్​గా నటించారు. ఎస్‌.జె. సూర్య ప్రతి నాయకుడిగా కీలక పాత్ర పోషించారు. సినిమా విడుదల సందర్భంగా ఎక్స్‌ వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు నాని. ఏం మాట్లాడారంటే?

'ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఎలా ఉండబోతోంది?' అని ఓ ఫ్యాన్ అడగగా - స్థిర శనివారం సమవర్థి (డైలాగ్‌ను ఉద్దేశించి) లా ఇంటర్వెల్​ బ్యాంగ్ ఉంటుందని సినిమా గురించి నాని చెప్పారు. ఈ సినిమా ఫైనల్‌ కాపీ చూశాక ఈ మువీ 'సరిపోయింది శనివారం'లా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సాధారణంగా నాని సినిమాల్లో ఎమోషన్స్​ ఎక్కువగా ఉంటాయి. సినిమా చూసిన ఆడియెన్స్​ ఏదో ఒక సందర్భంలో కన్నీరు పెట్టుకుంటుంటారని వింటూనే ఉంటాం. అయితే ఈ సారి కూడా అలాంటి ఏడిపించే ఎమోషన్స్​ ఉంటాయా? అని ఓ అభిమాని అడిగారు. దానికి 'నేను ప్రామిస్‌ చేయలేను' అని నాని బదులిచ్చారు.

'ఈ సినిమాతో సమంత, కిచ్చా సుదీప్‌లకు ఏదైనా లింక్‌ ఉందా?' అని అడగగా ఉందని మరోసారి క్లారిటీ ఇచ్చారు నేచురల్ స్టార్. అంతకుముందు 'ఈగ'లో సమంత, కిచ్చా సుదీప్​తో కలిసి నాని నటించిన సంగతి తెలిసిందే. అలానే సరిపోదా శనివారం ప్రమోషన్స్​లోనూ సమంత, కిచ్చా సుదీప్​ను కలిశారు నాని.

Nani Saripoda Sanivaram Movie Review : ఇకపోతే సరిపోదా శనివారం రివ్యూ విషయానికొస్తే తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో నాని ఫ్యాన్స్ హంగామా ప్రారంభించేశారు. సినిమా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. నాని ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్​తో పాటు ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌, క్లైమాక్స్ యాక్ష‌న్ సీక్వెన్స్​ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉన్నాయని అంటున్నారు. రేసీ స్క్రీన్‌ప్లే, హై ఇంటెన్స్‌ యాక్ష‌న్ సీక్వెన్స్​ థ్రిల్లింగ్‌ను పంచాయని కామెంట్లు చేస్తున్నారు. నాని, ఎస్​ జే సూర్య(Nani, SJ Suryah) నటన వేరె లెవల్ ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా జేక్స్‌ బెజాయ్‌ అందించిన సంగీతం సినిమాను మరో లెవెల్​కు తీసుకెళ్లిందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నాని 'సరిపోదా శనివారం' ఎలా ఉందంటే? - Saripoda Sanivaram Movie Review

ఆ ఓటీటీలోనే 'సరిపోదా శనివారం' - ఎప్పుడు వస్తుందంటే? - Saripoda Sanivaram OTT

ABOUT THE AUTHOR

...view details