Saripoda Sanivaram Nani Janhvi kapoor : 'సరిపోదా శనివారం'తో థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు హీరో నాని. వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ నెల 29న రిలీజ్ కానుందీ చిత్రం. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని తన కొత్త సినిమాకు సంబంధించి కొద్ది రోజులుగా వస్తోన్న రూమర్స్‌కు ఫుల్ స్టాఫ్ పెట్టారు. తన అప్‌కమింగ్ మూవీలో జాన్వీ కపూర్ నటించనుందని వస్తోన్న ప్రచారంపై స్పందించారు.
"నా తర్వాతి సినిమాలో జాన్వీ నటించనుందని వస్తున్న వార్తలు కేవలం రూమర్ మాత్రమే. బహుశ ఆమెను తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అవుతోంది. నేను కొద్ది రోజులుగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. అందుకే ఆ ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతానికి వివరాలు క్లారిటీగా తెలుసుకోలేకపోతున్నాను" అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశముంది.
కాగా, నాని - దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో నిర్మాత చెరుకూరి సుధాకర్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలోనే జాన్వి కపూర్‌ను హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. గతంలో నాని - శ్రీకాంత్ కాంబోలో వచ్చిన దసరా చిత్రం రూ.100 కోట్ల భారీ సక్సెస్‌ను సాధించింది.