Samantha About Divorce : హీరోయిన్ సమంత సందర్భం వచ్చినప్పుడల్లా తన విడాకులు, ఎదుర్కొన్న మయోసైటిస్ వ్యాధి గురించి మాట్లాడుతూనే ఉంటుంది. అయితే దీనిపై చాలా సార్లు ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిస్తే, మరికొంతమంది ఆమె సింపతీ కోసమే దాని గురించి మాట్లాడుతుంటుంది అని కామెంట్లు చేస్తుంటారు. అయినా కూడా సామ్ వాటిపై ప్రతీసారి స్పందిస్తూనే ఉంటుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఈ విషయాల్ని లేవనెత్తింది. తాను విడాకులు తీసుకున్న సమయంలో ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి మాట్లాడింది. మహిళలు ఎదుర్కొనే సామాజిక సవాళ్ల గురించి ప్రస్తావించింది. ఇద్దరి మధ్య బంధం విడిపోతే, మొదటగా అమ్మాయిలనే నిందిస్తారని సామ్ చెప్పారు. దురదృష్టవశాత్తూ మనం అలాంటి సమాజంలో బతుకుతున్నామని అసహనం వ్యక్తం చేసింది. తనపై ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది.
విడాకుల గురించి సామ్ మాట్లాడుతూ -"డివొర్స్ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు, మహిళలకు ఈ సమాజం కొన్ని ట్యాగ్స్ ఇస్తుంది. సెకండ్ హ్యాండ్, ఆమె జీవితం ఇక వేస్ట్, యూజ్డ్ అని ఎందుకు ట్యాగ్స్ ఎందుకు తగిలిస్తారో తెలీదు. నాకైతే అర్థం కావడం లేదు. ఆ అమ్మాయిని, తన కుటుంబాన్ని ఈ ట్యాగ్స్, విమర్శలు ఎంతగానో బాధిస్తాయి. కష్టాల్లో ఉన్న సదరు మహిళను, అమ్మాయిని ఇవి మరింత ఎక్కువగా నిరాశ పరుస్తాయి. నా గురించి కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారు. అవి అబద్ధాలు, అందుకే వాటి గురించి మాట్లాడాలని ఎప్పుడూ అనుకోలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుం బసభ్యులు చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు" అని సామ్ పేర్కొంది.