Samantha New Movie :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ కోసం సూపర్ సర్ఫ్రైజ్ ఇచ్చింది. తన బర్త్‌డే సందర్భంగా కొత్త మూవీ గురించి అనౌన్స్ చేసింది. మా ఇంటి బంగాం అనే టైటిల్‌తో ఈ సినిమా రానుంది. సామ్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన 'ట్రా లాలా' ఈ మూవీని తెరకెక్కించనుంది. ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మించనున్న తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం.
ఇక సామ్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను నెట్టింట పంచుకున్నారు. దాన్ని సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేసింది. 'మెరిసిందల్లా బంగారం అవ్వాలని లేదు' అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జత చేసింది. అందులో సామ్ చీర కట్టుకుని ఓ గృహిణిగా కనిపించింది. అయితే ఆమె చేతిలో గన్ కూడా పట్టుకుని కాస్త వైలెంట్గానూ కనిపించింది.
ముఖం మీద రక్తం మరకలు కూడా ఉన్నాయి. ఈ పోస్టర్ చూస్తుంటే ఆమె మరోసారి తనలోని యాక్షన్ కోణాన్ని చూపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇది లేడీ ఓరియెంటడ్ మూవీగా తెలుస్తోంది. అయితే ఆ ఫోటోలో ప్రొడక్షన్ హౌస్ గురించి తప్ప మిగతా వివరాలను వెల్లడించలేదు. దీంతో ఫ్యాన్స్ ఆసక్తి మరింత పెరిగిపోయింది.