తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ భయం ఉంది - అందుకే హిందీ భాష మాట్లాడను : సమంత - CITADEL SAMANTHA ABOUT HINDI

సిటాడెల్ ప్రమోషన్స్​లో తాను ఎందుకు హిందీ మాట్లాడదో స్పందించింది హీరోయన్ సమంత!

Samantha Citadel Webseries
Samantha Citadel Webseries (source Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2024, 10:30 AM IST

Samantha Citadel Webseries : హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ 'సిటాడెల్‌ : హనీ బన్ని'. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నవంబర్‌ 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో టీమ్​ ప్రమోషన్స్​లో జోరు పెంచింది. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సిరీస్‌పై ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నం చేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా సమంత, ధావన్​తో పాటు సిరీస్‌ దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే ఓ ఆంగ్ల మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సిరీస్‌లో హీరోయిన్​గా మొదట సమంతను అనుకోలేదని దర్శకుడు అన్నారు.

"ది ఫ్యామిలీ మ్యాన్-2 షూటింగ్​ సమయంలో సిటాడెల్‌ స్క్రిప్ట్‌ దశలోనే ఉంది. అందుకే మేము సమంతకు దీని గురించి ఏమీ చెప్పలేదు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్​ పూర్తవ్వగానే హీరోగా వరుణ్‌ను తీసుకున్నాం. హీరోయిన్​గా ఎవరిని తీసుకోవాలని కాస్త ఆలోచించాం. ఎందుకంటే వరుణ్ హిందీ బాగా మాట్లాడతాడు, అందుకే హీరోయిన్ కూడా హిందీ మాట్లాడే వారైతేనే బాగుంటుందని అనుకున్నాం. ది ఫ్యామిలీ మ్యాన్-2 సమయంలో సమంతకు హిందీ రాదు. ఆమె మాట్లాడలేదు. అందుకే ఆమెను కాకుండా ఇంకొకరిని తీసుకోవాలని అనుకున్నాం. అయితే ఒక రోజు సమంత హిందీలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాను. అంత స్పష్టంగా ఎలా మాట్లాడుతుందో అర్థం కాలేదు. దీంతో వెంటనే ఆమెతోనే సిరీస్‌ చేయాలని భావించా" అని దర్శకుడు అన్నారు.

ఈ కామెంట్స్​పై సమంత స్పందించింది. సిటాడెల్‌లో నా(హనీ) పాత్రకు హిందీ బాగా వచ్చు. ఈ విషయాన్ని మీరు గుర్తించలేదు. ఉచ్చారణలో తప్పులు వస్తాయన్న భయంతో నేను వేదికలపై హిందీ మాట్లాడను" అని సమంత చెప్పుకొచ్చారు.

మొదట ఆమెనే నా మైండ్​లోకి వచ్చింది(Varun Dhawan Citadel Webseries) - ఇదే ఇంటర్వ్యూలో వరుణ్‌ ధావన్ మాట్లాడుతూ సమంతను ప్రసంసించారు. సిటాడెల్‌ స్క్రిప్ట్‌ తన వద్దకు రాగానే హీరోయిన్‌గా సమంత అయితేనే బాగుంటుందని తాను అనుకున్నట్లు చెప్పారు వరుణ్. దర్శకులతో దీని గురించి డిస్కస్ చేసినప్పుడు నా మెదడులోకి వచ్చిన మొదటి హీరోయిన్‌ తనే. ఆమె అయితేనే ఈ పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందని అనిపించింది. సామ్ ఈ ప్రాజెక్ట్​లో భాగమైతే మా సిరీస్ మరింత పెద్దది అవుతుందనుకున్నాం. అనుకున్నట్లే ఆమెను తీసుకున్నాం. ఈ సిరీస్​లో మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది" అని చెప్పారు.

'దయచేసి చప్పట్లు కొట్టొద్దు' : సంచలన రేప్​ కేస్​పై పాట పాడిన శ్రేయా ఘోషల్‌

రణ్‌బీర్‌ కోసం ఇద్దరు భామలు

ABOUT THE AUTHOR

...view details