Salman Khan Kick 2 Movie :బాలీవుడ్ కండల వీరుడు షారుక్ ఖాన్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో 'కిక్'ఒకటి. 2014లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో పాటు కాసుల వర్షం కురిపించింది. అయితే అప్పట్లో ఈ చిత్రానికి సీక్వెల్ విడుదల కానున్నట్లు ప్రకటించినప్పటికీ అది రూమర్స్‌గానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు ఆ రూమర్స్ నిజం కానున్నట్లు మేకర్సే ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కండల వీరుడి సూపర్ ఫొటో షూట్‌తో 'కిక్ 2' అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
స్టార్ నిర్మాత సాజిద్ నడియాద్వాలా తాజాగా సల్మాన్‌కు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేసి 'ఇది ఓ గ్రేట్ కిక్ 2 ఫొటోషూట్ సికందర్' అంటూ క్యాప్షన్‌ను జోడించారు. చూస్తుంటే ఈ సారి మొదటి పార్ట్ కంటే సీక్వెల్లో ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోందని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో సమంత కూడా నటిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. కానీ మేకర్స్ ఈ విషయంపై ఇప్పటివరకూ స్పందించలేదు.
ఇదిలా ఉండగా, 2009లో రవితేజ హీరోగా నటించిన 'కిక్' రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ఒరిజినల్ సినిమాలోని కొన్ని సీన్స్‌ను బీటౌన్ అభిమానులకు తగ్గట్లుగా మార్చి తెరకెక్కించడం వల్ల అక్కడి వారు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాడెంజ్ తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు.