Salman Khan Heroine Who Quit Movies At Career Peak : బాలీవుడ్‌లోని టాప్ 3 స్టార్ హీరోల్లో ఒకరైన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో పాటు నటించి కూడా సినిమాలకు దూరమయ్యారు ఓ స్టార్ హీరోయిన్. ఒకానొక కాలంలో సల్మాన్ కంటే ఎక్కువ పారితోషకం కూడా అందుకున్నారు ఆమె. అయితే ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. ఇంతకీ ఆమె ఎవరు ? ఆమె సినిమాలకు ఎందుకు దూరమయ్యారంటే ?
'మైనే ప్యార్ కియా' అనే హిందీ సినిమాలో ఈమె నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉందరు. అంతలా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి నటించారు. ఆమెవరో కాదు అలనాటి అందాల తార భాగ్య శ్రీ. ఈ ఒక్క సినిమాతోనే బాలీవుడ్లో స్టార్డమ్ సంపాదించుకుని ఓ వెలుగు వెలిగారు. వాస్తవానికి ఆమె 1987లోనే 'కచ్చి ధూప్' అనే టెలివిజన్ సీరియల్‌తో తన కెరీర్ స్టార్ట్ చేశారు. అందులో ఆమె యాక్టింగ్‌కు మెచ్చిన డైరెక్టర్లు వరుస సినిమా ఆఫర్లను ఆమె ముందుంచ్చారు. తనకొచ్చిన ఛాన్స్‌లను సద్వినియోగం చేసుకుని రాణించారు భాగ్య శ్రీ. అలా వచ్చిన 'మైనే ప్యార్ కియా' సినిమా ఒక్కసారిగా ఆమెను సూపర్ స్టార్ గా మార్చింది. 1989లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లోనే రూ.28 కోట్లకు పైగా వసూలు చేసింది. స్టార్టింగ్ సినిమాకే ఆమె సల్మాన్ ఖాన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారంటే ఆశ్చర్యకరమైన విషయమే.