Horoscope Today November 16th 2024 : నవంబర్ 16వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఈ రోజు కాస్త పట్టు విడుపు ధోరణి పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల అవసరాలు, కోరికలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసర వాదనల్లోకి దిగి అపవాదుల్ని మీదకు తెచ్చుకోకండి. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శ్రేయస్కరం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ఆర్థికంగా అభివృద్ధి, ధన లాభం చేకూరే మార్గాలు పుష్కలంగా ఉన్నాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. ఈ రోజంతా కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సన్నిహితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడేది పొరబాటు లేకుండా మాట్లాడాలి. లేదంటే వివాదాలు, అపార్థాలు రావచ్చు. ధ్యానం చేయడం వలన ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆధ్యాత్మిక సంబంధమైన ఙ్ఞానం మాత్రమే నిజమైన ఆనందాన్ని ఇవ్వగలదు. శివాలయ సందర్శనం మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అనుకోకుండా ఆర్థిక లబ్ధి, అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడటం వల్ల సంతోషంగా ఉంటారు. మీ సానుకూల ధోరణితో ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్లారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో, కృత నిశ్చయంతో పనిచేసి వృత్తి వ్యాపారాలలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. పదోన్నతులు ఉండవచ్చు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సామాజికంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీ తండ్రిగారితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. పిత్రార్జిత భూమి, ఆస్తి విషయాల్లో లబ్ది పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలలో వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతాయి. అలసట, బద్ధకంతో పని పట్ల నిర్లక్ష్యంతో ఉంటారు. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉంటారు. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. వివాదాలు, అనారోగ్యం, కోపం ఇవన్నీ మీకు ప్రశాంత లేకుండా చేస్తాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. సన్నిహితులతో మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రోజు అనుకోకుండా ఆర్థిక లాభం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో చోటు చేసుకున్న గొప్ప మార్పులు మీకు ఆర్థికంగా ఊహించని లాభాలు తెచ్చి పెడతాయి. ఎటు చూసినా శుభ ఫలితాలే ఉండడంతో ఈ రోజంతా సరదాగా, సంతోషంగా ఉంటారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. నూతన వస్త్రాభరణాలు కొంటారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం ఇలా అన్నీ ఒకేసారి కలిసి రావడంతో సంతోషంగా ఉంటారు. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అన్ని పనులు విజయవంతంగా పూర్తి కావడం వల్ల ఈ రోజంతా చురుగ్గా ఉంటారు. సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. జరిగిపోయిన విషయాలను గురించి ఆలోచిస్తూ ఈ రోజంతా విచారంతో, చింతతోనే గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, ఆరోగ్య సంబంధమైన చికాకులతో వృత్తి పట్ల శ్రద్ధ చూపలేకపోతారు. కీలక వ్యవహారాల్లో నిర్ణయాత్మక శక్తి లోపిస్తుంది. ఉన్నతాధికారుల మెప్పు పొందే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ కలహాల పట్ల రాజీధోరణి అవలంభిస్తే మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఖర్చులు మితిమీరే ప్రమాదముంది. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. ముఖ్యమైన పనుల్లో పరిణితితో ప్రవర్తిస్తే మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి ఈ రోజు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు ఫలవంతంగా ఉంటాయి. ఈ రోజు ఏ పని చేపట్టినా విజయవంతం అవుతుంది. కీలమైన వ్యవహారాల్లో తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. మీ సృజనాత్మకతతో, దృఢ నిశ్చయంతో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. ఇష్ట దేవత ఆలయ సందర్శన శుభప్రదం.