తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆ ప్రశ్నకు బదులివ్వాలంటే నేను స్క్రిప్ట్​ దొంగలించాలి' - సలార్ డైరెక్టర్ వైఫ్​ రిప్లై! - సలార్ మూవీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

Salaar Movie Akhil Cameo : 'సలార్​-2'లో అక్కినేని అఖిల్​ ఉన్నట్లు పలు వార్తలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్​ సతీమణి లిఖితా రెడ్డి స్పందించారు. దీంతో పాటు 'సలార్' మూవీ గురించి ఫ్యాన్స్​ అడిగిన ప్రశ్నలకు ఇన్​స్టా వేదికగా రిప్లై ఇచ్చారు. ఆ విశేషాలు మీ కోసం.

Salaar Movie Akhil Cameo
Salaar Movie Akhil Cameo

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 8:13 PM IST

Salaar Movie Akhil Cameo :రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్​లో తెరకెక్కి అత్యంత సక్సెస్​ సాధించిన మూవీ 'సలార్​'. పాన్​ఇండియా లెవెల్​లో తెరకెక్కిన ఈ మూవీ అటు కలెక్షన్లతో పాటు ఇటు రికార్డుల పరంగా టాప్​లో కొనసాగుతోంది. ఫస్ట్​ పార్ట్​తో గూస్​బంప్స్​ తెప్పించిన ప్రశాంత్‌ నీల్‌, సెకెండ్ పార్ట్​కు 'శౌర్యాంగపర్వం' అనే టైటిల్​ను ఫిక్స్​ చేశారు. దీంతో ఈ మూవీ అప్​డేట్స్​ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ సక్సెస్​ పార్టీ జరిగింది. అందులో మూవీ టీమ్​ మొత్తం పాల్గొని సందడి చేసింది. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అయితే అందులో అందరి దృష్టి అక్కినేని అఖిల్​ పై పడింది. ఇక ఈ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచిన అఖిల్​ గురించి నెట్టింట అనేక రూమర్స్ మొదలయ్యాయి. అఖిల్‌ సెకెండ్ పార్ట్​లో కేమియో రోల్ చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై ప్రశాంత్‌ నీల్‌ సతీమణి లిఖితా రెడ్డి స్పందించారు. అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఇన్​స్టా వేదికగా 'సలార్‌ పార్ట్‌ 2' గురించి పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

'సలార్‌ పార్ట్‌ 2'లో ప్రశాంత్‌ని ఆశించవచ్చా అంటూ ఓ నెటిజన్​ అడగ్గా దానికి ఆయన నీడ కూడా కనిపించదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ఇక దేవా, రాధారమతో ఆద్యకు ఉన్న సంబంధం ఏమిటి? అని మరోకరు అడగ్గా, దానికి 'నువ్వు అడిగిన ఈ ప్రశ్నకు బదులివ్వాలంటే 'శౌర్యాంగపర్వం' స్క్రిప్ట్‌ను నేను దొంగిలించాలి' అని అన్నారు. ఇంతే కాకుండా మరిన్ని ప్రశ్నలకు లిఖిత ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ఇక 'సలార్‌'క్లైమాక్స్‌లో ప్రభాస్‌ శరీరం పచ్చరంగులోకి మారడానికి కారణం ఏమిటంటూ ఓ ఫ్యాన్​ అడగ్గా, అదిశౌర్యాంగల తెగ రంగు అని అందుకే దేవ ఎక్కువగా ఆ రంగు దుస్తుల్లో కనిపిస్తాడని క్లారిటీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details