తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా - నిజమెంత? - vijay Devarkonda PrasanthNeel - VIJAY DEVARKONDA PRASANTHNEEL

Prasanth Neel Vijay Devarkonda Movie : ప్రశాంత్ నీల్ -​ విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత?

.
.

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 10:15 PM IST

Prasanth Neel Vijay Devarkonda Movie :ఫిల్మ్ ఇండిస్ట్రీలో చాలా కాంబోల పేర్లు వినిపిస్తుంటాయి. కానీ అన్నీ సెట్స్​పైకి వెళ్లవు. ఒకవేళ వెళ్లినా అన్నీ తెరపైకి రావు. కొన్ని మాత్రమే సెట్స్​పైకి వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకుని సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అయితే తాజాగా మరో కొత్త కాంబినేషన్ పేరు వినిపిస్తోంది. అదే విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ రెండు పేర్లు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

హైదరాబాద్​లో దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారని, విజయ్​ వ్యక్తిగత సిబ్బందిని కలిశారని ప్రచారం సాగుతోంది. అలానే త్వరలోనే వీరిద్దరి కలయికలో ఓ పాన్​ ఇండియా మూవీ చూడొచ్చని అంటూ కథలు అల్లేస్తున్నారు. కానీ వాస్తవానికి జరిగింది వేరని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలీయలేదు కానీ సినిమా మాత్రం వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ లైనప్​ పెద్దగా ఉంది. ప్రాక్టిగల్​గా ఆలోచిస్తే ఆ లైనప్​తోనే ఆయనకు 2026 దాటేస్తోంది. ప్రస్తుతం ఆయన సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం మొదలు పెట్టాల్సి ఉంది. షూటింగ్​, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు అన్ని కలిపి ఇంకో ఆరు నెలల సమయం పట్టొచ్చు. ఇది పూర్తవ్వడానికి ఏడాదికి పైగానే పడుతుంది. ఆ తర్వాత జూనియర్​ ఎన్టీఆర్​తో కలిసి మైత్రి మూవీ మేకర్స్​ బ్యానర్​లో ఓ సినిమా చేయాలి. ఇది కూడా మరో ఏడాది పట్టే ఛాన్స్ ఉంది. అనంతరం రామ్ చరణ్​తో ఓ సినిమా పెండింగ్​లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

కాబట్టి ఇదంతా పూర్తయ్యేసరికి చాలా కాలమే పడుతుంది. కాబట్టి ఇప్పట్లో ప్రశాంత్ నీల్​ - విజయ్ దేవరకొండ సినిమా ఉండకపోవచ్చు. ఇకపోతే విజయ్ దేవరకొండ మార్కెట్ వరుస ఫ్లాపులతో కాస్త స్లోగా ఉంది. ప్రస్తుతం ఈయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం రౌడీ హీరో ఫోకస్ అంతా ఈ మూవీపైనే ఉంది. ఎందుకంటే భారీ ఆశలు పెట్టుకున్న ఖుషి భారీ స్థాయిలో సక్సెస్ కాలేదు. ది ఫ్యామిలీ స్టార్ అయితే డిజాస్టర్ అయిపోయింది. ఇక కొంతకాలం క్రితం సుకుమార్​తో చేయాల్సిన సినిమా చేజారిపోయింది!

'మలయాళ సినిమాలు బ్లాక్​ బస్టర్లు అవ్వడానికి కారణమిదే' - Fahadh faasil

బాలయ్యను ఢీ కొట్టేందుకు సెట్​లోకి అడుగుపెట్టేసిన హంటర్​ - NBK 109 Villain

ABOUT THE AUTHOR

...view details