Sai Pallavi Sister Pooja Kannan Marriage : ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి ఇంట శుభకార్యం జరిగింది. ఆమె సోదరి, నటి పూజా కన్నన్ పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ వినీత్‌తో ఏడడుగులు వేసి మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది.
అయితే ఈ వేడుకల్లో హీరోయిన్ సాయి పల్లవి పూజా కన్నన్‌తో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. అలానే సోదరితో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ కూడా చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు, వీడియోలు చూసిన పలువురు నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి డ్యాన్స్‌కు మరోసారి ఫిదా అవుతూ వాటిని తెగ షేర్ చేస్తున్నారు.
Pooja Kannan Movies : కాగా, సాయి పల్లవి సోదరిగా పూజ కన్నన్ కూడా చాలా మంది సౌత్ సినీ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. కోలీవుడ్ మూవీ చితిరై సెవ్వానంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 2021లో విడుదలైన ఈ చిత్రంలో పూజ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమెపై చాలా మంది సినీ ప్రియులు ప్రశంసలు కురిపించారు. ఇకపోతే పూజ కన్నన్(Pooja Kannan Love Marriage) చాలా కాలం నుంచి వినీత్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది జనవరిలో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకలోనూ సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సోదరితో కలిసి చిందులేసింది.