తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సాయి పల్లవి నటించిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా? - 'ప్రేమమ్'​ మాత్రం కాదు! - Sai Pallavi Debut Movie - SAI PALLAVI DEBUT MOVIE

Sai Pallavi First Movie : సాయి పల్లవి ఫస్ట్ మూవీ అంటే అందరూ వెంటనే 'ప్రేమమ్'​ అని చెప్పేస్తారు. అందులో తన యాక్టింగ్​తో అంతలా ఆకట్టుకుంది. అయితే ఆమె నటించిన మూవీ అది కాదని తాజాగా సాయి పల్లవి రివీల్ చేసింది. ఇంతకీ తన డెబ్యూ మూవీ ఏంటో తెలుసుకుందామా?

Sai Pallavi First Movie
Sai Pallavi First Movie (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2024, 7:00 AM IST

Updated : Aug 25, 2024, 7:23 AM IST

Sai Pallavi First Movie : నేచురల్ యాక్టింగ్ అంటే ఠక్కున గుర్తొస్తుంది మల్లు బ్యూటీ సాయి పల్లవి. మినిమల్​ మేకప్​తో, నేచురల్ లుక్స్​తో ఆకట్టుకునే ఈ చిన్నది, తన నటనతోనే కాకుండా డ్యాన్స్​తోనూ ప్రేక్షకుల మనసులు దోచుకుంది. అందుకే భాషతో సంబంధం లేకుండా ఈమెకు దాదాపు అన్ని సౌత్ఇండియన్ లాంగ్వేజస్​లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇప్పుడిప్పుడే నార్త్​లోనూ తన సత్తా చాటాలని అడుగుపెట్టింది. తెలుగులోనూ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

అయితే అందరూ ఆమె మలయాళం 'ప్రేమమ్​' సినిమా ద్వారానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందని అనుకుంటారు. కానీ వాస్తవానికి దానికంటే ముందే ఆమె సినిమాల్లో నటించిందట. తాజాగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసి అందరికీ షాకిచ్చింది.

"చాలామంది నేను ప్రేమమ్‌ సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని అనుకుంటారు. కానీ అంతకంటే ముందే నేను రెండు సినిమాల్లో కనిపించాను. 'కస్తూరీ మాన్‌', 'ధామ్‌ధూమ్‌' అనే రెండు తమిళ చిత్రాల్లో చిన్నపాటి పాత్రలు చేశాను " అంటూ చెప్పుకొచ్చింది.

ఇది విన్న నెటిజన్లు ఒక్కసారిగా షాకయ్యారు. కొందరైతే ఆ సినిమాలను మళ్లీ చూసి అందులోని సాయి పల్లవి క్లిప్పింగ్స్​ను ట్రెండ్ చేస్తున్నారు. అభిమానులు కూడా 'సాయి పల్లవిని ఇందులో అస్సలు పోల్చుకోలేకపోతున్నాం'. 'తనను గుర్తుపట్టలేదే మనం' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆ పోస్టర్ చూసి ఏడ్చాను
ఇక ఇదే ఇంటర్య్వూలో తన ఫస్ట్ తెలుగు మూవీ గురించి మాట్లాడింది. "తెలుగులో నేను డెబ్యూ చేసిన 'ఫిదా' నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలిసారి ఆ మూవీ పోస్టర్‌ను చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. షూటింగ్‌లోకి అడుగుపెట్టినప్పుడే అనుకున్నా ఈ మూవీ ఆడియో లాంఛ్​లో నేను తెలుగు స్పీచ్ ఇవ్వాలని. అనుకున్నట్లుగా నేను చేశాను కూడా. అంతే కాదు ఆ సినిమా నాకు ప్రతిష్టాత్మక ఫిలింఫేర్‌ అవార్డునూ తెచ్చిపెట్టింది. ఆ సినిమాతో నా జీవితం మలుపు
తిరిగింది మరి.

SaiPallavi Upcoming Movies : ఇక సాయి పల్లవి అప్​కమింగ్ మూవీస్ విషయానికి వస్తే, తెలుగులో నాగచైతన్యతో కలిసి 'తండేల్' చిత్రంలో నటిస్తోంది. హిందీలో మరో రెండు సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్​ తనయుడి సరసన కనిపించనుంది. దీంతోపాటు రణ్​బీర్ కపూర్​తో 'రామాయణ్' సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి." అంటూ సాయి పల్లవి ఎమోషనల్ అయ్యింది.

అరుంధతి సాంగ్​కు సాయి పల్లవి డ్యాన్స్ - ఈ వీడియో చూశారా? - Saipallavi Dance

ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌లో సాయి ప‌ల్ల‌వి రేర్​ ఫీట్​! - Saipallavi Filmfare Awards

Last Updated : Aug 25, 2024, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details