RRR Sequel Rajamouli : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరును తెచ్చిపెట్టింది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయకేతనం ఎగరేసి, రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ఇప్పటికీ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట స్క్రీనింగ్ అవుతూనే ఉంది. రీసెంట్గా కూడా మార్చి 18న జపాన్‌లో జరిగిన 'ఆర్ఆర్ఆర్' స్పెషల్ స్క్రీనింగ్ షోకు సినిమా దర్శకుడు రాజమౌళి గెస్ట్‌గా హాజరైన సంగతి తెలిసిందే. విజవల్ వండర్ గా తెరకెక్కిన ఈ 'ఆర్ఆర్ఆర్' సినిమా అక్కడి వారికి కూడా తెగ నచ్చేసింది. ఊహించని రీతిలో రెస్పాన్స్ రావడంతో పాటు అక్కడి అభిమానులు రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించారు.
అయితే తాాజాగా 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్‌కు సంబంధించిన ప్రశ్నలు దర్శకుడు జక్కన్నకు మరోసారి ఎదురయ్యాయి. దీనికి ఆయన సమాధానం చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అందులో ఆయన నోటి వెంట 'ఆర్ఆర్ఆర్-2' అనే మాట రావడమే ఆలస్యం అక్కడి వారంతా కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ గోల గోల చేశారు. వారి అభిమానానకి ఎంతో ఆనందించిన దర్శకధీరుడు "నాకు సినిమా గురించి చాలా ఆలోచనలు ఉన్నాయి. కానీ వాటిని ప్రస్తుతం మీతో చెప్పలేను" అని చెప్పారు.