తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTTలో భయపెట్టేందుకు మరో తెలుగు హారర్ మూవీ రెడీ - చూసే సాహసం చేయగలరా? - రితికా సింగ్ ఈటీవీ విన్​

Ritika Singh Horror Movie Valari OTT Release : గురు ఫేమ్ రితికా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన ఓ హారర్ చిత్రం ఓటీటీ రిలీజ్​కు రెడీ అయింది. పోస్టర్లు చూస్తుంటే భయంకరంగా అనిపిస్తున్నాయి! దాని స్ట్రీమింగ్ వివరాలను తెలుసుకుందాం.

OTTలోకి మరో భయపెట్టే సినిమా - చూసే సాహసం చేయగలరా?
OTTలోకి మరో భయపెట్టే సినిమా - చూసే సాహసం చేయగలరా?

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 6:34 AM IST

Ritika Singh Horror Movie Valari OTT Release :ఈమె పేరు దివ్య‌. ద‌యా గుణం గల అమ్మాయి. ప్ర‌తి ఒక్క‌రితో ఎంతో మంచిగా, సరదాగా ఉంటుంది. కానీ ప్ర‌పంచానికి తెలియ‌ని ఓ గ‌తం ఆమె జీవితంలో దాగుంది. ఆమె గతంలో దాగి ఉన్న నిజాన్ని తెలుసుకుందాం అంటూ ఓ సరికొత్త తెలుగు హారర్ మూవీ ఆడియెన్స్​ను భయపెట్టేందుకు సిద్ధమైంది. దాని పేరే వళరి. గురు ఫేమ్ రితికా సింగ్ ఈ భయపెట్టే సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో నటించింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం డెరెక్ట్​గా ఓటీటీలో రిలీజ్​కు రెడీ అవుతోంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో మార్చి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది.

వ‌ళ‌రిలో రితికా సింగ్‌తో పాటు నటుడు శ్రీరామ్ కూడా ప్ర‌ధాన పాత్ర‌లో నటించారు. కెప్టెన్ న‌వీన్ నాయుడుగా కనిపించనున్నారు. ఇప్పటికే శ్రీరామ్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. తాజాగా రితికాకు సంబంధించిన పోస్టర్​ను రిలీజ్ చేసింది. పోస్టర్‌లో రితికా దీనంగా పడుకొని చూస్తు ఉండగా, వెనక వైపు నుంచి దెయ్యం రూపంలో జుట్టు విరబోసుకున్న ఓ బాలిక నిలబడి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్‌తో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌ను ఆడియెన్స్​ ముందుకు వదలనున్నారు.

వ‌ళ‌రిని త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు సంప్ర‌దాయ‌ ఆయుధంగా వినియోగిస్తుంటారు. 1800 ద‌శ‌కంలో బ్రిటీష్ ప్ర‌భుత్వం ఈ ఆయుధాన్ని నిషేధించింది. ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ కొనసాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక రితిక డిఫ‌రెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ చిత్రంతో ఎంట్రీ : సీనియర్ నటుడు మాధ‌వ‌న్ హీరోగా న‌టించినఇరుదుసుట్రు చిత్రంతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చన రితికాసింగ్‌ - సినిమాలో బాక్స‌ర్​గా కనిపించి తన నటనతో ఆకటత్టుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని గురు పేరుతో రీమేక్ చేశారు. ఆ తర్వాత నీవెవ‌రో, ఓ మై క‌డావులే, శివ‌లింగ‌తో పాటు మ‌రికొన్ని చిత్రాల్లో నటించింది. రీసెంట్​గా దుల్క‌ర్ స‌ల్మాన్ కింగ్ ఆఫ్ కోతాలోనూ స్పెషల్ సాంగ్​లో అలరించింది. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ వేట్టైయాన్‌లో ఓ యాక్ష‌న్ పాత్రలో కనిపించనుంది.

పవన్ ఫ్యాన్స్​కు వీరమల్లు టీమ్ సర్​ప్రైజ్​ - త్వరలో గ్లింప్స్​ రెడీ!

ట్రెండీగా రకుల్‌ పెళ్లి కార్డు - ఆ హ్యాష్​ట్యాగ్​కు అర్థం ఏంటంటే ?

ABOUT THE AUTHOR

...view details