తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సలార్- 2 షూటింగ్ బ్రేక్- నిజమెంత? - Salaar 2 - SALAAR 2

Salaar- 2 Shooting: ప్రభాస్‌ ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సలార్-2'. అయితే ఈ సినిమా షూటింగ్‌ ఇప్పట్లో ప్రారంభమయ్యే ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతంటే?

Salaar 2 Shooting
Salaar 2 Shooting (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 6:57 AM IST

Updated : May 26, 2024, 7:48 AM IST

Salaar- 2 Shooting:రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సలార్' గతేడాది రీలీజై భారీ విజయం దక్కించుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మునుపెన్నడు లేని విధంగా ప్రభాస్​ను మాస్​ లుక్​లో చూపించడం ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక దీని సీక్వెల్ 'శౌర్యంగ పర్వం'లో ప్రభాస్ యాక్షన్ సీన్స్​, వైలెన్స్ ఎక్కువగా ఉంటాయని మేకర్స్ తెలిపిన నేపథ్యంలో ఫ్యాన్స్​లో ఆసక్తి నెలకొంది. దీంతో సలార్ పార్ట్- 2 (శౌర్యంగ పర్వం) ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్​ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్​కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

హీరో ప్రభాస్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్​కు మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయని, అందుకే సిినిమా షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. చిత్రీకరణ ప్రారంభం అయ్యేందుకు ఇంకా సమయం పట్టొచ్చొని, దీంతో ప్రభాస్ తాత్కాలికంగా సలార్- 2ను పక్కనబెట్టినట్లు రూమర్లు పుట్టుకొచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే వీటన్నింటికీ మూవీటీమ్ తాజాగా చెక్ పెట్టింది. సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్​ సెట్స్‌లో ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ నవ్వుతూ కనిపించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్​కు 'వారు నవ్వకుండా ఉండలేరు' అంటూ క్యాప్షన్ జోడించి పరోక్షంగా రూమర్స్‌ని ఖండించింది. ఇక తాజా అప్‌డేట్‌తో రూమర్లకు చెక్‌ పడినట్టైంది.

ఇక సినిమా విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ రూపొందించిన 'సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్' 2023 డిసెంబరులో రిలీజై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. గ్లోబల్ బాక్సాఫీస్​ రికార్డుల ప్రకారం సినిమా రూ.700+ కోట్లు వసూలు చేసింది. దీనికి సీక్వెల్‌గా రానున్న 'సలార్-2'లో, కథ మొత్తం ఖాన్సార్ రాజకీయం నేపథ్యంలో కొనసాగుతుందట. మిత్రులుగా ఉన్న ప్రభాస్, పృథ్వీరాజ్ ఎందుకు శత్రువులుగా మారాల్సి వచ్చిందనే అంశంపైనే చిత్రం పూర్తిగా ఉంటుందట.

'ప్రశాంత్​ బ్యాడ్ హాబిట్స్- ఒక్కోసారి చంపేయాలి అనిపించేది'- శ్రియా రెడ్డి - Shriya Reddy On Prashanth Neel

ప్రశాంత్ నీల్ షాకింగ్ డెసిషన్- 'సలార్ 2'కు బ్రేక్- ఆ స్టార్ హీరో కోసమేనట! - Salaar Part 2 Postponed

Last Updated : May 26, 2024, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details