Rashmika Weekend Plan : నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్. ఆమె ఏం చేసినా, మాట్లాడినా అది సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తుంటుంది. ఎందుకంటే ఈ భామ క్రేజ్ అలాంటిది. ఇప్పటికే తన క్యూట్ అండ్ స్మైల్ యాక్టింగ్‌తో చాలా మంది కుర్రాళ్ల మదిని కట్టిపడేసింది. బోల్డ్ ఫొటోషూట్స్తోనూ మెస్మరైజ్ చేస్తుంటుంది. ఈ మధ్య సినిమాల్లోనూ కాస్త గట్టిగానే బోల్డ్ యాక్టింగ్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
నాగశౌర్య ఛలో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గీతా గోవిందంతో మస్త్ పాపులారిటినీ సంపాదించుకుంది. ఇక దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ వంటి సినిమాలు చేసి స్టార్ స్టేటస్ అందుకుంది. అనంతరం పుష్పతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. బాలీవుడ్‌లోనూ మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ చిత్రాలతో తనదైన ముద్ర వేసేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. యానిమల్ చిత్రంలో గీతాంజలిగా నటించి విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
అయితే ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంటున్న రష్మిక వీకెండ్లో ఏం చేస్తుందో తెలిసింది. ఇంత బిజీ షెడ్యూల్లోనూ వీకెండ్లో ఫ్యామిలీ కోసం కాస్త టైమ్ కేటాయిస్తారట. అంతకన్నా ఎక్కువగా ఫ్రెండ్స్‌తో గడుపుతారట. అదే తనకు చాలా ఇష్టమని తెలిసింది. ఇకపోతే రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప 2లో నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ సినిమా