Rashmika Mandanna Latest Interview : 'పుష్ప' సినిమాతో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు నేషనల్ క్రష్‌గా ఉన్న ఆమె ఇప్పుుడు గ్లోబల్ ఫేవరట్‌గా మారింది. తన యాక్టింగ్కూ ఓవర్సీస్లోనూ మంచి క్రేజ్ ఉంది. దీంతో వరుస ఆఫర్లు అందుకుని అటు నార్త్‌తో పాటు ఇటు సౌత్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా విడుదలైన యానిమల్ కూడా ఆమెకు మాసివ్ సక్సెస్‌ను అందించింది. ఈ నేపథ్యంలో తాజాగా సక్సెస్ అండ్ ఫేమ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తాను ఈ విజయాలను పెద్దగా పట్టించుకోనని వెల్లడించింది.
"నాకంటే అందమైన, తెలివైన అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. వాళ్లకూ సూపర్ ట్యాలెంట్ ఉంది. అయితే మనల్ని మనం నిరూపించుకునే అవకాశాలు అతి కొద్దిమందికే వస్తుంది. నాకు కూడా అలాంటి అవకాశాలు వచ్చాయి కాబట్టే నేను ఇప్పుడు ఈ పొజిషన్‌కు చేరుకున్నాను. నన్ను గుర్తించిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌కు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. అయితే కెరీర్‌లో సాధించిన సక్సెస్‌ను, అలాగే ఎదుర్కొన్న ఫేయిల్యూర్స్ను పట్టించుకోకూడదు. ఏ ఫీల్డ్‌లోనైనా అవి కామనే. ఇటీవలే ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను. మనం చేసే ప్రతీ పనిని ఆడియెన్స్ బాగా గమనిస్తారు. ప్రశంసలు, విమర్శలు లాంటివి కూడా మనకు ఎదురవుతాయి. కానీ వాటి గురించి ఆలోచిస్తే మనం మానసికంగా కుంగిపోతాం. జీవితంలో ఇక ముందుకు సాగలేం. అందుకే వాటిని నేను అస్సలు పట్టించుకోను" అని చెప్పారు.
ఇక రష్మిక మూవీస్ విషయానికి వస్తే- రష్మిక ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు ధనుశ్ నాగార్జున కాంబోలో తెరకెక్కుతున్న 'డీ 51' సినిమాలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలు రెండూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక 'పుష్ప' ఈ ఏడాది ఆగస్ట్ 15 థియేటర్లలోకి రానుండగా, ధనుశ్ మూవీ మాత్రం తమ సినిమా టైటిల్‌తో పాటు ఈ చిత్రం గురించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంది.