Rashmika Mandanna Injury :జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా కాలికి గాయమైందని స్టార్ హీరోయిన్ రష్మిక ఇటీవలె తన అభిమానులకు తెలిపింది. అయితే తాజాగా ఆమె హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. స్టాఫ్ సాయంతో ఆమె చాలా ఇబ్బందిగా నడుచుకుంటూ వీల్‌ఛైర్ ఎక్కి ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లింది. తన ఫేస్‌ను మొత్తం ఆమె కవర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆమె తన అప్‌కమింగ్ మూవీ ప్రమోషన్స్ కోసం ముంబయి బయల్దేరినట్లు సమాచారం.
ఇక ఈ వీడియో చూసి రష్మిక ఫ్యాన్స్ మరింత ఆందోళన చెందుతున్నారు. ఆమె గాయం మాని త్వరగా కోలుకోవాలంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. ఇటువంటి సమయంలో రెస్ట్ తీసుకోకుండా తను ఎంతో డెడికేషన్‌తో ప్రమోషన్స్‌కు వెళ్తోందని అంటున్నారు.
ఇంతకీ ఏమైందంటే?
తనకు ఇటీవలే గాయమైనట్లు రష్మిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆ దెబ్బ మానడానికి ఎంత సమయం పడుతుందో తెలియదని చెప్పుకొచ్చింది. "నేను పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని 'సికందర్', 'థామ', 'కుబేర' షూటింగ్స్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ ఆలస్యానికి నన్ను క్షమించాలంటూ ఆ మూవీ డైరెక్టర్స్‌ను కోరుతున్నా. నా కాలు ఏమాత్రం సెట్ అయినా సరే వెంటనే సెట్స్‌లోకి వచ్చేస్తాను" అని తెలిపారు.