Rashmika Mandanna Anand Devarakonda : రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ ఈ రెండు పేర్లు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఏదో ఉందని, డేటింగ్ చేస్తున్నారని, ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. అందుకు కారణం వీరిద్దరు కలిసి సీక్రెట్ ట్రిప్స్‌కు వెళ్లడం!, కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకోవడం, ఒకరిపై మరొకరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసుకోవడం. ఇవన్నీ చూసిన నెటిజన్లు, అభిమానులు రష్మిక - విజయ్ దేవరకొండను అన్నా- వదిన అంటూ వారిని ట్రెండ్ చేస్తుంటారు.
అయితే తాజాగా మరోసారి రష్మిక – విజయ్ దేవరకొండను ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. అయితే ఈ సారి అందుకు కారణం విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. తాజాగా ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు జరుపుకున్నాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే రష్మిక కూడా తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో ఆనంద్ దేవరకొండ ఫోటో షేర్ చేసి విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్ డే ఆనందా అంటూ రాసుకొచ్చింది.
దీనికి ఆనంద్ దేవరకొండ థ్యాంకూ అంటూ బదులిచ్చాడు. అలానే రష్మికను ముద్దుగా రుషి అని పిలిచాడు. ఈ వరస్ట్ ఫోటో ఎందుకు పెట్టావు అని సరదాగా అన్నాడు. దీనికి రష్మిక కూడా మళ్ళీ రిప్లై ఇచ్చింది. అందుకే నేను అడిగినప్పుడు మంచిగా పోజ్ ఇవ్వమంటాను అంటూ సరదాగా అన్నది. అయితే ఈ కన్వర్జేషన్లో ఆనంద్ రష్మికను క్యూట్‌గా రుషీ అనడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ దేవరకొండ - రష్మిక మధ్య ఉన్న బాండింగ్ వల్లే ఆనంద్ - రష్మిక ఇంత క్లోజ్‌గా ఉంటున్నారు, ఎంతైనా వదిన కదా అందుకే ఈ క్యూట్ కన్వర్జేషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.