తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'యానిమల్ పార్క్​ను అప్పుడే షురూ చేస్తాం - రిలీజ్ ఆ ఏడాదిలో' : నిర్మాత భూషణ్ కుమార్ - RANBIR KAPOOR ANIMAL PARK

రణ్​బీర్​ కపూర్​ 'యానిమల్ పార్క్' రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత భూషణ్ కుమార్

Animal Park Ranbir Kapoor
Animal Park Ranbir Kapoor (source ETV Bharat and ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 3:27 PM IST

Animal Park Release Producer Bhusan Kumar : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా, తెలుగు దర్శకుడు సందీప్‌ వంగా తెరకెక్కించిన చిత్రం 'యానిమల్‌'. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి, అదిరే వసూళ్లను అందుకుంది.

ఈ సినిమా రిలీజ్ సమయంలోనే యానిమల్​కు సీక్వెల్‌గా 'యానిమల్‌ పార్క్‌'ను ప్రకటించారు. మొదటి భాగం క్లైమాక్స్‌లో సీక్వెల్‌ ఉంటుందని తెలిపారు. అప్పటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాపై నిర్మాత భూషణ్‌ కుమార్‌ మాట్లాడారు.

"దర్శకుడు సందీప్‌ వంగా ప్రస్తుతం స్పిరిట్‌ చిత్రంతో బిజీగా ఉన్నారు. అది పూర్తవ్వగానే యానిమల్‌ పార్క్‌ మొదలు పెడతారు. ఆరు నెలల్లో ఈ చిత్ర పనులు మొదలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. స్పిరిట్‌ పూర్తైన వెంటనే యానిమల్‌ పార్క్‌ సినిమా ఉంటుంది. 2027లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం." అని భూషణ్ కుమార్ తెలిపారు.

ఈ చిత్ర తొలి భాగం కన్నా రెండో భాగంలో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయని సందీప్‌ వంగా గతంలో తెలిపారు. గతంలో విడుదలైన చిత్రాల కన్నా ఎక్కువ థ్రిల్‌ను పంచడమే 'యానిమల్‌ పార్క్‌' లక్ష్యమని చెప్పారు. ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలు సినిమాలో ఉంటాయని భూషణ్ కుమార్​ పేర్కొన్నారు. రణ్‌బీర్‌ కపూర్ పాత్ర మరింత వైల్డ్​గా ఉంటుందని చెప్పారు.

Ranbir Kapoor Ramayan Movie : ప్రస్తుతం రణ్‌బీర్‌ కూడా రామాయణ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. దర్శకుడు నితేశ్‌ తివారీ డైరెక్షన్​లో రణ్‌బీర్‌ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా ఇది. ఈ చిత్రం తర్వాతే రణ్​బీర్​ 'యానిమల్‌ పార్క్‌' చేసే అవకాశముంది. ఇకపోతే స్పిరిట్​ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ వంగా రీసెంట్​గానే ఈ చిత్రం మ్యూజిక్ సిటింగ్స్ పనులను ప్రారంభించారు. ఇది పోలీస్ డ్రామాగా రూపొందనుంది. ఇందులో ప్రభాస్ పవర్​ ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​గా కనిపించనున్నారని తెలిసింది.

ప్రభాస్ బిగ్ డీల్​ - ఆ బడా నిర్మాణ సంస్థతో మూడు ప్రాజెక్ట్​లు ఖరారు

'రామాయణ' రిలీజ్ డేట్ లాక్- అఫీషియల్ అనౌన్స్​మెంట్

ABOUT THE AUTHOR

...view details