Ramcharan Gamechanger Movie : RRR ప్రపంచ వ్యాప్తంగా ఎంత హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ చిత్రం కోసం ఏళ్ల తరబడి సమయం వెచ్చించిన రామ్ చరణ్‌కు ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా విషయంలోనూ అదే పరిస్థితి వచ్చి పడింది. అదిగో, ఇదిగో అంటూ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్‌లు చేస్తున్న జాప్యానికి రామ్ చరణ్ అభిమానులకు చిర్రెత్తుకొస్తుంది. ఈ సినిమా రిలీజ్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదా లేదా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందో తెలీక గందరగోళంలో పడ్డారు అభిమానులు.
Ramcharan RC 16 : అయితే ఇప్పుడు బుచ్చిబాబు డైరక్షన్‌లో చేయాల్సిన సినిమాకు ముహూర్తం ఎప్పుడురా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు ఫ్యాన్స్. ఆర్సీ 16 పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు స్క్రిప్ట్ రెడీ చేసినా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. జూన్ లేదా జులైలో సెట్స్ పైకి వెళ్తుందని అప్పట్లో వినిపించినా దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. మరి ఎందుకు ఆలస్యం అవుతుందో పక్కాగా క్లారిటీ లేదు.
Sukumar Ramcharan RC 17 : మరోవైపు పుష్ప 2 ది రూల్ పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్ ఆగష్టు 15 తర్వాత ఫ్రీ అయిపోతారు. కొన్ని నెలల క్రితం ఆర్సీ 17 ప్రాజెక్టును కన్ఫామ్ చేసుకున్న ఆయన పుష్ప 2 రిలీజ్ తర్వాత ఆ పనిలో పడతారు. అదే గేమ్ ఛేంజర్ రిలీజ్ అయి ఉంటే రామ్ చరణ్ ఒకటి తర్వాత మరొకటి స్పీడ్‌గా చిత్రీకరణలు పూర్తి చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు శంకర్ సినిమా వాయిదా పడుతూ పోవడం వల్ల ఈ చిత్రంతో పాటు ఆర్సీ 17, ఆర్సీ 16 షూటింగులు కూడా ఒకేసారి చేయకతప్పదేమో అనిపిస్తోంది. అలా గురుశిష్యులైన సుకుమార్, బుచ్చిబాబు సనా ఇద్దరూ కలిసి తమ సినిమాల కోసం ఒకేసారి చెర్రీని డైరక్ట్ చేయాల్సి వస్తుందేమోనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.