GameChanger Movie Release Date : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయినా ఈ చిత్ర రిలీజ్ డేట్ గురించి మాత్రం మూవీటీమ్ ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ వచ్చింది. షూటింగ్ కూడా ఎంతో ఆలస్యంగా అవుతూ వచ్చింది.
అయితే ఆ మధ్య నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టు తెలిపారు. కానీ రిలీజ్ డేట్‌ను మాత్రం చెప్పలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ డేట్ కూడా చెప్పొచ్చుగా అంటూ కామెంట్లు చేశారు.
తాజాగా గేమ్ ఛేంజర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విడుదల తేదీపై కాస్త క్లారిటీ ఇచ్చారు. తన తాజా పోస్ట్‌తో రిలీజ్ డేట్‌ను ఇండైరెక్ట్‌గా కన్ఫామ్ చేశారు. "వచ్చే వారం నుంచి డిసెంబరు 20 వరకు ప్రచార చిత్రాలు, ఈవెంట్స్ ఉంటాయి. రెడీగా ఉండండి" అని రాసుకొచ్చారు. అలానే నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కూడా తమన్ పోస్ట్‌ను రీ పోస్ట్ చేసి ఫ్యాన్స్‌లో మరింత జోష్ పెంచింది.