తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రణ్​బీర్, సాయి పల్లవి రెమ్యూనరేషన్- రామాయణ్​కు ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలుసా? - Ramayana Ranbir Kapoor - RAMAYANA RANBIR KAPOOR

Ramayana Ranbir Kapoor Remuneration: నితీశ్​ తివారి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ్​లో రణ్​బీర్ కపూర్, సాయి పల్లవి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.

Ramayana Ranbir Kapoor Remuneration
Ramayana Ranbir Kapoor Remuneration

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 6:46 PM IST

Updated : Apr 8, 2024, 6:52 AM IST

Ramayana Ranbir Kapoor Remuneration:నితీశ్​ తివారి దర్శకత్వం వహిస్తున్న 'రామాయణ' సినిమా గురించి ఎదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. అయితే ఈ సినిమా గురించి, నటినటుల వివరాలుగానీ మేకర్స్​ ఏ విధమైన అధికారిక అనౌన్స్​మెంట్ చేయలేదు. అయినప్పటికీ ఈ మూవీ గురించి ఏదో ఒక వార్త బయటకు వస్తూ ప్రేక్షకులకు, అభిమానులకు ప్రాజెక్ట్​పై మరింత క్రేజ్ పెరిగేలా చేస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైందని, సన్నివేశాల కోసం రూ.11 కోట్ల ఖర్చుతో అయోధ్య సెట్ కూడా ఏర్పాటు చేశారని అంటున్నారు. అయితే ఈ చిత్రంలో ఆయా పాత్రల్లో నటించనున్న రణ్​బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ రెమ్యూనరేషన్​పై కూడా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

ఈ సినిమా కోసం స్టార్ హీరో రణ్​బీర్ ఏకంగా రూ.250 కోట్లు తీసుకుంటున్నాడని, ఆ మొత్తాన్ని పలు ఇన్స్​స్టాల్​మెంట్స్​ రూపంలో అందుకోనున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక్కో ఇన్స్​స్టాల్​మెంట్​లో రూ.75కోట్ల చొప్పున తీసుకుంటున్నాడని ప్రచారం సాగుతోంది. మరోవైపు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా భారీగానే పారితోషికం అందుకోనుందట. ఈ సినిమాకు సాయి పల్లవి ఏకంగా రూ. 18-20కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాలో మరో కీలక పాత్ర పోషించనున్న కన్నడ స్టార్ యశ్​ రూ.150 కోట్ల మేర అందుకోనున్నారని బీ టౌన్​లో టాక్ వినిపిస్తుంది. కానీ, ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అటు మూవీటీమ్ కూడా స్పందించలేదు.

రామయణ్​​ కన్నా ముందే బాలీవుడ్​లోకి సాయి పల్లవి!:నేచురల్ బ్యూటీ నితీశ్​ తివారి రామాయణ్​ కంటే ముందే బాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వనుంది. స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో సాయి పల్లవి(Saipallavi upcoming movies) అతడికి జోడిగా నటిస్తోంది. ఇటు తెలుగులో ప్రస్తుతం నాగచైతన్య అక్కినేని తండేల్​ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపై ఆడియెన్స్​లో మంచి అంచనాలే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటాయో.

రూ.100 కోట్ల క్లబ్​లోకి సిద్ధు- బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ డబుల్ జోరు - Tillu Square Collections

వంద కోట్ల క్లబ్​లో తెలుగు యంగ్ హీరోలు- నిఖిల్, సిద్ధు, తేజ లిస్ట్​లో ఇంకా ఎవరంటే - 100 Crore Tollywood Heros

Last Updated : Apr 8, 2024, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details